అన్‌లాక్‌ 3.0 లో అనుమతి ఉన్నవి, లేనివి ఇవే, మార్గదర్శకాలు విడుదల

Gyms, Night Curfew, Night Curfew Ends, Night Curfew Ends India, Unlock 3, unlock 3 guidelines, Unlock 3 News, Unlock 3 Updates, Unlock 3.0, Unlock 3.0 Guidelines Rules, Yoga Centers Reopen on August 5

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో అన్ని కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఆగస్టు‌ 31 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి జూలై 29, బుధవారం నాడు అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. అలాగే కంటైన్మెంట్ జోన్స్ కానీ ప్రాంతాల్లో మరికొన్ని కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు అనుమతి నిచ్చారు. ఈ మేరకు కేంద్ర హోమ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

అన్‌లాక్‌ 3.0 లో అనుమతి లేనివి – (ఆగస్టు 31 వరకు నిషేధం):

  • పాఠశాలలు, విద్యా సంస్థలు, మరియు కోచింగ్ సంస్థలు
  • మెట్రో రైళ్లు
  • సినిమా థియేటర్స్
  • స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్ మెంట్ పార్క్స్, బార్‌లు మరియు ఆడిటోరియంలు, అసెంబ్లీ హాళ్ళు
  • సామాజిక రాజకీయ/ క్రీడలు / వినోదం / విద్యా / సాంస్కృతిక మతపరమైన కార్యక్రమాలు, బహిరంగ సభలు

అన్‌లాక్‌ 3.0 లో అనుమతి ఉన్నవి:

  • నైట్ కర్ఫ్యూ ఎత్తివేత, రాత్రి సమయంలో వ్యక్తుల కదలికలపై పరిమితులు తొలగించబడ్డాయి
  • ఆగస్టు 5 నుంచి యోగా ఇంస్టిట్యూట్స్ మరియు జిమ్స్ తెరవడానికి అనుమతి
  • సామాజిక దూరం మరియు ఇతర హెల్త్ ప్రోటోకాల్స్ అనుసరించి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకోడానికి అనుమతి
  • వందే భారత్ మిషన్ కింద ప్రయాణీకుల ఇంటర్నేషనల్ ప్రయాణాన్ని పరిమిత పద్ధతిలో అనుమతిస్తారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + nine =