జపాన్‌ జీ7 సదస్సులో ఆసక్తికర సన్నివేశం.. ప్రధాని మోదీకి అమెరికా, ఉక్రెయిన్ అధ్యక్షుల షేక్ హ్యాండ్

US president Joe Biden and Ukraine President Zelensky Shake Hands with PM Modi at G7 Summit in Japan,US president Joe Biden and Ukraine President,Ukraine President Zelensky Shake,Zelensky Shake Hands with PM Modi,PM Modi at G7 Summit in Japan,Mango News,PM Modi During Japan Visit,PM Modi For G7 Summit,PM Modi in Hiroshima Today,Mahatma Gandhis Bust Unveiled,PM Modi G7 Summit Live,G7 summit LIVE updates,G7 Summit,G7 Summit 2023,G7 summit 2023 Live,G7 Summit in Japan,G7 Summit Latest News, G7 Summit Latest Updates, G7 Summit Live News, G7 Summit Quad Leaders Meet,PM Modi departs to attend the G7 summit,PM Narendra Modi Latest News,Prime Minister Narendra Modi

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జపాన్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. జపాన్ ప్రధానమంత్రి ఫ్యూమియో కిషిడా ఆహ్వానం మేరకు హిరోషిమా వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక జీ7 దేశాల సదస్సులో ఆయన పాల్గొంటున్నారు. కాగా ఈ సమ్మిట్‌లో భారత్‌, జపాన్‌లతో పాటు అమెరికా, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, ఇండోనేసియా, దక్షిణ కొరియా, వియత్నాం తదితర దేశాల అధినేతలు ఈ జీ-7 సదస్సుకు హాజరయ్యారు. ఈ క్రమంలో జీ-7 సదస్సులో భాగంగా ఒక అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఏమైందంటే.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రధాని మోదీని పలకరించేందుకు స్వయంగా ఆయన ఉన్న వేదిక దగ్గరకు వచ్చారు. దీనిని గమనించి ప్రధాని మోదీ కూడా లేచి బైడెన్‌ను పలకరించారు. ఇద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకుని షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు

అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా ప్రధాని మోదీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఒకరికొకరు నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. అనంతరం వీరిరువురూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. కాగా గతేడాది ఫిబ్రవరి 24న తూర్పు ఐరోపా దేశమైన ఉక్రెయిన్‌పై రష్యా సైనిక ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత ఇరు దేశాల అధినేతలు కలుసుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక వీరిద్దరి భేటీకి సంబంధించిన వివరాలపై భారత ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఏడాదిన్నరగా తాము ఫోన్‌లో మాట్లాడుకుంటున్నామని, ఇప్పుడు కలిసే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొత్తం ప్రపంచానికి సమస్యగా మారిందన్న ఆయన ఇది ప్రపంచంపై అనేక రకాలుగా ప్రభావం చూపుతోందని అభిప్రాయపడ్డారు. త్వరలోనే దీనికి ముగింపు ఉండొచ్చని ఆశిస్తున్నామన్న ప్రధాని మోదీ, భారత్ తరఫున ఈ సమస్యకు పరిష్కారం కోసం చేయాల్సినదంతా చేస్తామని జెలెన్‌స్కీకి భరోసా ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 3 =