కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ భేటీ

5 things Mamata Banerjee said after meeting Sonia Gandhi, Congress President Sonia Gandhi, Mamata Banerjee, Mamata Banerjee Meets Congress President Sonia Gandhi in Delhi, Mamata Banerjee meets Sonia Gandhi, Mamata Banerjee Meets Sonia Gandhi in Delhi, Mango News, Pegasus to 2024 polls, Sonia Gandhi, West Bengal CM, west bengal cm mamata banerjee, West Bengal CM Mamata Banerjee Meets Congress President Sonia Gandhi in Delhi, West Bengal CM Mamata Banerjee Meets Congress President Sonia Gandhi in Delhi Today

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన 5 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు ప్రముఖ నేతలతో భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నాడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సీఎం మమతా బెనర్జీ భేటీ అయ్యారు. దాదాపుగా 45 నిమిషాల పాటుగా సాగిన ఈ సమావేశంలో దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, 2024 ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఏకమవడం సహా వివిధ అంశాలపై చర్చించినట్టు తెలుస్తుంది. సోనియా గాంధీతో సమావేశం అనంతరం సీఎం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ, సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీతో సమావేశం సానుకూలంగా సాగిందని చెప్పారు.

పెగాసస్ వ్యవహారం, దేశంలోని కరోనా పరిస్థితులు, ప్రతిపక్షాల ఐక్యత గురించి చర్చించామని తెలిపారు. దేశంలో బీజేపీని ఓడించడానికి అందరూ కలిసి రావాలని, అన్ని పక్షాలు కలిసి పనిచేయవలసి ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కూడా సీఎం మమతా బెనర్జీ భేటీ అయి, రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి, కోవిడ్ వ్యాక్సిన్ల సరఫరా, ఔషధాల సరఫరా మరియు పశ్చిమబెంగాల్ రాష్ట్ర పేరు మార్పు ప్రతిపాదన గురించి చర్చించిన సంగతి తెలిసిందే.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here