ఆరు దర్వాజాలకు ఆరు జంతువులు కాపలా

What Does The Special Gates In The New Parliament Symbolize,New Parliament House New Delhi,New Parliament Building,First Day In The New Parliament Commences,Mango News,Mango News Telugu,New Parliament Building Latest News,New Parliament Building Updates,New Parliament Building Latest News and Live Updates,New Parliament Building Live Updates,New Parliament Building Session,New Parliament Building Session Live Updates,India's New Parliament House,Shardula Dwar, Hamsa Dwar,Makara Dwar,Gaj Dwar,Ashwa Dwar,Garuda Dwar

భారత పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిన్నటి నుంచీ మొదలవగా.. ఈ రోజు నుంచీ కొత్త పార్లమెంట్‌లో చర్చలు షురూ అయ్యాయి. అయితే ఈ న్యూ పార్లమెంట్‌లోకి వెళ్లేవారంతా వాటి గుమ్మాల దగ్గర ఆగి పరిశీలించి మరీ లోపలకు వెళుతున్నారట. అంతేకాదు అవి చాలా ప్రత్యేకంగా కనిపించడటంతో.. వాటిని గురించి అడిగి మరీ వెళుతున్నారట.

అవును నిజమే అంత ప్రత్యేకత ఉన్నాయి కాబట్టే వాటి పేర్లను కూడా ప్రత్యేకంగా పెట్టారట. పార్లమెంట్ భవనంలో ఉన్న 6 దర్వాజలకు ఆరు పౌరాణిక ప్రాణుల పేర్లను పెట్టారు. ఈ ఆరు ప్రాణులే ఇప్పుడు 140 కోట్ల భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ ప్రత్యేకతలను సూచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే వాటి గురించి తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.

కొత్త పార్లమెంట్‌లో ఆరు ద్వారాలు ఉండగా..అవి గజ ద్వారం, అశ్వ ద్వారం, గరుడ ద్వారం, మకర ద్వారం, శార్దూల ద్వారం, హంస ద్వారంగా పేర్లు పెట్టారు. ప్రతి ద్వారం కూడా.. దాని పేరుపై ఉన్న ప్రాణి ఉన్న శిల్పంతో ఆకట్టుకుంటోంది.

ఏనుగు అంటే.. బుద్ధి, జ్ఞాపకశక్తి, సంపద, జ్ఞానాన్ని సూచించేది పెద్దలు చెబుతారు. ఏనుగు పేరు మీదుగా గజ ద్వారంగా ఓ గుమ్మానికి ఈ పేరు పెట్టారు. ఈ ద్వారం పార్లమెంట్ భవనానికి ఉత్తరం వైపుగా ఉంది. ఉత్తరం, వాస్తు శాస్త్రం ప్రకారం, బుధగ్రహంతో సంబంధం కలిగి ఉండటంతో దీనిని ఉత్తరం వైపున ఉంచారు అంతేకాదు ఏనుగును తెలివికి మూలం అని కూడా నమ్ముతారు

రెండవది అశ్వ ద్వారం. గుర్రం పేరుతో రెండో గుమ్మానికి ఈ పేరు పెట్టారు. శక్తి, బలం,ధైర్యాన్ని గుర్రం సూచిస్తుందని అంటారు. పాలనకు ఎలాంటి లక్షణాలు ఉండాలో ఈ గుమ్మం గుర్తుచేస్తుంది.

మూడో ద్వారానికి గరుడ పేరు పెట్టారు. పక్షుల రాజు గరుడను.. విష్ణువు వాహనంగా చెబుతారు. హిందూ త్రిమూర్తులలో సంరక్షకుడు అయిన విష్ణువుతో గరుడకు అనుబంధం ఉందంటారు. గరుడను శక్తి, ధర్మానికి చిహ్నంగా భావిస్తారు. ఇది చాలా దేశాల చిహ్నాలపై అందుకే ఉపయోగించారని కూడా అంటారు. కొత్త పార్లమెంటు భవనానికి తూర్పు ద్వారమే ఈ గరుడ ద్వారం .

ఇక నాలుగో ద్వారంగా ఉంది మకర ద్వారం. మకరాన్ని సముద్ర చేపగా పిలుస్తుంటారు. దక్షిణ, ఆగ్నేయాసియాలో విస్తరించి ఉన్న హిందూ, బౌద్ధ స్మారక కట్టడాలలో.. మకరం అనేది సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. గుమ్మాల వద్ద మకర శిల్పాలు రక్షకులుగా కనిపించడానికి అమరుస్తారు. అయితే కొత్త పార్లమెంటులో ప్రవేశ ద్వారంవైపు మకర ద్వారం ఉంటుంది.

అలాగే ఐదవ ద్వారం పేరు శార్దూలం ద్వారం.ఇది చూడటానికి విచిత్రంగా ఉంటుంది. సింహం శరీరం లేదా గుర్రం శరీరం..దీనికి ఏనుగు లేదా చిలుక తల ఉంటుంది. కొత్త పార్లమెంట్ భవనం గేటుపై శార్దూల ద్వారం ఉండటం దేశ ప్రజల శక్తిని ఈ శార్దూలం సూచిస్తుందని ఇక్కడ ఒక నోటులో పేర్కొన్నారు.

పార్లమెంటు ఆరవ ద్వారమే హంస ద్వారం. హంస అంటే హిందూ జ్ఞాన దేవత అయిన సరస్వతి వాహనం. ఈ హంస మోక్షాన్ని సూచించే పక్షిగా చెబుతారు. అలాగే జనన, మరణ చక్రం నుంచి ఆత్మ విముక్తిని హంస సూచిస్తుంది. పార్లమెంటు గేటుపై ఉన్న ఈ హంస శిల్పం .. స్వీయ సాక్షాత్కారానికి, జ్ఞానానికి చిహ్నంగా భావించి ఆరో ద్వారంగా ఏర్పాటు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 3 =