టాప్‌‌లో అమెరికా, లాస్ట్‌లో భూటాన్..

What is Indias Rank in Military, Indias Rank in Military, Military Rank India, India Military, India Military Power, India Military Rank, Indian Army, Indian Army Rank, Military, Military Strength Ranking, Economic Stability, Geographical Location, Indias Rank In Military Power, Mango News, Mango News Telugu
Military Strength Ranking ,Economic stability, geographical location, India's rank in military power? America on the top, Bhutan on the last

ప్రపంచంలోనే అత్యంత శక్తి వంతమైన మిలిటరీ కలిగి ఉన్న దేశంగా..అగ్రరాజ్యం అమెరికా తొలిస్థానంలో నిలిచింది. అమెరికా తర్వాత స్థానంలో రష్యా ఉండగా..మూడో స్థానంలో చైనా ఉంది. అలాగే  శక్తివంతమైన దేశంగానే ఎదుగుతున్న భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.

ప్రపంచ రక్షణ సమాచారాన్ని ట్రాక్ చేస్తూ ఉండే వెబ్‌సైట్ గ్లోబల్ ఫైర్‌ పవర్.. ప్రతీ ఏడాది మిలిటరీ పవర్  కలిగి ఉన్న దేశాల ర్యాంకింగ్స్ ప్రకటిస్తూ వస్తుంది. అలాగే  2024కి గానూ ప్రపంచదేశాల మిలిటరీ పవర్‌కి ర్యాంకింగ్స్‌ను కేటాయించింది.

అలా ప్రపంచంలోని 145 దేశాల మిలిటరీ పవర్ కలిగిన ర్యాంకుల్ని గ్లోబల్ ఫైర్‌ పవర్  వెల్లడించింది. సైనికుల సంఖ్యతో పాటు,వారి దగ్గర ఉండే యుద్ధానికి వాడగలిగే ఆయుధాలు, ఎకానమిక్ స్టేబులిటీ, భౌగోళిక స్థానంతో పాటు సైన్యానికి అందుబాటులో ఉన్న వనరులు వంటి 60 కంటే ఎక్కువ అంశాలనే దీనిలో పరిగణనలోకి తీసుకున్న గ్లోబల్ ఫైర్‌ పవర్.. ఈ పవర్ ఇండెక్స్ స్కోర్‌ని నిర్ణయించింది.

గ్లోబల్ ఫైర్‌ పవర్ రిలీజ్ చేసిన ఈ జాబితాలో ఇజ్రాయిల్ 17 స్థానంలో ఉంది. డిఫెన్స్ బడ్జెట్ పరంగా చూస్తే అమెరికా టాప్‌లో ఉంది. చైనా రెండో స్థానంలోనూ, రష్యా 3వ స్థానంలో  ఉండగా.. భారతదేశం 4వ స్థానంలో ఉంది. బడ్జెట్ పరంగా పాకిస్తాన్ 47వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 43వ స్థానంలో ఉంది.

ప్రపంచంలో అత్యంత పవర్‌ఫుల్ మిలిటరీ ఉన్న 10 దేశాలు:

1- అమెరికా

2- రష్యా

3- చైనా

4- భారతదేశం

5- దక్షిణ కొరియా

6- యునైటెడ్ కింగ్‌డమ్

7- జపాన్

8 -టర్కీయే

9- పాకిస్తాన్

10- ఇటలీ

ప్రపంచంలో అతి తక్కువ శక్తివంతమైన మిలిటరీని కలిగిన 10 దేశాలు

145- భూటాన్

144- మోల్డోవా

143- సురినామ్

142-సోమాలియా

141- బెనిన్

140- లైబీరియా

139-బెలిజ్

138- సియర్రా లియోన్

137-సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్

136- ఐస్లాండ్

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =