చంద్రయాన్-2 ప్రయోగం వాయిదా

Chandrayaan-2 Launch Called Off, Chandrayaan 2 Second moon mission postponed, ISRO Chandrayaan 2 mission on hold, ISRO postpones Chandrayaan 2 mission launch, ISRO Postpones Launch Of Chandrayaan 2, Launch of India moon mission Chandrayaan 2 put off, Mango News, technical glitch Chandrayaan 2

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగము ఊహించని విధంగా ఆగిపోయింది. ప్రయోగానికి అంత సిద్దమైన సమయంలో వాహన నౌక జీఎస్ఎల్వి మార్క్-3 లో సాంకేతిక సమస్యను గుర్తించడంతో, తర్వాత వచ్చే ఇబ్బందులను దృష్టి లో ఉంచుకొని ముందుగానే ప్రయోగాన్ని నిలిపివేస్తున్నట్టు ఇస్రో ప్రకటించింది. 19 గంటల 4 నిమిషాల 36 సెకెన్ల పాటు, కొనసాగిన కౌంట్ డౌన్, ప్రయోగానికి మరో 56 నిమిషాల 24 సెకన్లు ఉందనగా సాంకేతిక కారణాలతో ఆగిపోయింది. సాంకేతిక సమస్యల వలనే, చంద్రయాన్-2 ప్రయోగాన్ని ఆపామని, తదుపరి తేదిని త్వరలోనే ప్రకటిస్తామని ఇస్రో అధికార ప్రతినిధి గురుప్రసాద్ ప్రకటించారు.

చంద్రయాన్-2 ప్రయోగం ప్రకటించిన నేపథ్యంలో, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరుమల దర్శనాంతరం, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంకు చేరుకున్నారు. అక్కడ చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని చంద్రుని పైకి పంపనున్న, జీఎస్ఎల్వి మార్క్-3 వాహన నౌక ను సందర్శించి, ఇస్రో సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు. చంద్రయాన్-2 ప్రయోగానికి మరి కొన్ని వారాలు పట్టవచ్చని, సాంకేతిక సమస్యలన్నింటిని అధిగమించాకే ఇలాంటి ప్రతిష్టాత్మకమైన ప్రయోగాన్ని చేపట్టాలని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

 

[subscribe]
[youtube_video videoid=p7HcwuqYiIU]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 17 =