యూపీఐ ఐడీలను ఎలా బ్లాక్ చేయాలి?

What about UPI IDs if the phone is lost,What about UPI IDs,If the phone is lost,About UPI IDs,How to Block UPI IDs, Phonepe, Google Pay,Paytm, UPI ID,OTP,How to block Paytm,How to block Google Pay,How to block PhonePe accounts,Google Find My Phone,Android ,iOS,UPI IDs Latest News,UPI IDs Latest Updates,About UPI IDs Latest News,About UPI IDs Latest Updates,About UPI IDs Live News
How to Block UPI IDs, Phonepe, Google Pay,Paytm, UPI ID,OTP,Google Find My Phone,Android ,iOS

ఇప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు చేతిలో ఫోన్ ఉంటే చాలు అన్ని పనులు చేసుకోవచ్చు. కావాల్సిన ఇన్ఫర్మేషన్ నుంచి ఆన్‌లైన్ చెల్లింపుల వరకూ అన్నీ అరచేతిలో ఉన్న మొబైల్ వల్లే జరిగిపోతాయి. వ్యాలెట్ మరిచిపోయినా, క్రెడిట్, డెబిట్ కార్డులు మర్చిపోయినా ఒకప్పుడు టెన్షన్ పడేవాళ్లు కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్‌లో ఉన్న యూపీఐ యాప్‌ల సాయంతో ఈజీగా అన్ని లావాదేవీలు జరుపుతున్నారు. అయితే ఒకవేళ ఎవరైనా మీ  ఫోన్ చోరీ చేస్తే..వాళ్ల చేతిలో పడి బ్యాంకు బ్యాలెన్స్ ఖాళీ చేసుకునే ప్రమాదం కూడా ఉంది కాబట్టి..ఏం చేయాలో తెలియక చాలా మంది టెన్షన్ పడుతారు. అయితే వెంటనే వాటిని ఆ ఐడీలను బ్లాక్ చేస్తే మీ డబ్బులు ఖాళీ కాకుండా చేసుకోవచ్చుని నిపుణులు చెబుతున్నారు.

ప్రతి ఒక్కరూ తమ మొబైల్స్‌లో యూపీఐ చెల్లింపు యాప్‌లయిన గూగుల్ పే, ఫోన్ పే, పే టీమ్, బీమ్ వంటి యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటున్నారు.  ఇవి ఉంటే చాలు స్కానర్ ద్వారానో,అవతలి వ్యక్తి ఫోన్ నంబర్ ద్వారానో ఆన్లైన్ పేమెంట్స్ చేసుకోవచ్చు.కానీ పొరపాటున మీ మొబైల్ ఫోన్ పోవడమో, చోరీకి గురవడమో జరిగితే వెంటనే  గూగుల్ పే, ఫోన్ పే, పే టీమ్ ఐడీలను వెంటనే బ్లాక్ చేసుకోవాలి. అప్పుడే మీ బ్యాంకు అకౌంట్లో ఉన్న డబ్బులు అవతలివారి చేతిలో పడకుండా ఉంటాయి. చాలామంది పాస్వర్డ్‌లు పెట్టుకుంటున్నా సైబర్ నేరగాళ్లు ఇంకా తెలివి మీరిపోతున్నారు కాబట్టి.. ఐడీని బ్లాక్ చేస్తే ఆర్థికంగా నష్టపోకుండా ఉంటారు.

ఫోన్ పేలో యూపీఐ ఐడీని ఇలా బ్లాక్ చేయాలి..

 • ముందుగా 02268727374 లేదా 08068727374కు కాల్ చేయాలి.
 • యూపీఐ ఐడీ లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌పై ఫిర్యాదు చేయాలి.
 • ఓటీపీ అందుకున్న తర్వాత, మీరు ఫోన్, సిమ్ కార్డ్  పోయిన ఎంపికను ఎంచుకోవాలి
 • అప్పుడు  కస్టమర్ కేర్‌తో కనెక్ట్ అవుతారు.
 • తర్వాత కస్టమర్ కేర్ అడిగిన సమాచారం అందిస్తే.. తాత్కాలికంగా ఫోన్ పే యూపీఐ ఐడీని బ్లాక్ చేస్తారు.

గూగుల్ పే యూపీఐ ఐడీని ఇలా బ్లాక్ చేయాలి..

 • ముందుగా 18004190157కు డయల్ చేయాలి
 • తర్వాత గూగుల్ పే ఖాతాను బ్లాక్ చేయడానికి కస్టమర్ కేర్‌కు తెలియజేయాలి.
 • ఆండ్రాయిడ్ వినియోగదారులు అయితే.. గూగుల్ ఫైండ్ మై ఫోన్  అని పీసీ లేదా వేరే మొబైల్  ఫోన్‌లో లాగిన్ చేయాలి. ఆ తర్వాత గూగుల్ పే డేటాను మొత్తం డేటాను రిమోట్‌గా తొలగించాలి. దీంతో  గూగుల్ పే అకౌంట్‌ను  తాత్కాలికంగా బ్లాక్ చేసుకోవచ్చు.
 • ఒకవేళ ఐఓఎస్ వినియోగదారులయితే.. ఫైండ్ మై యాప్ లేదా ఇతర యాపిల్ ఫొన్ నుంచి  మొత్తం డేటాను తొలగించుకుని గూగుల్ పే అకౌంటును బ్లాక్ చేసుకోవచ్చు.

పేటీఎమ్ యూపీఐ ఐడీని ఇలా  బ్లాక్ చేయాలి..

 • * ముందుగా పేటీఎమ్ బ్యాంక్ హెల్ప్‌లైన్ నంబర్- 01204456456కు కాల్ చేయాలి
 • * తర్వాత  వాయిస్ ఆప్షన్ సూచనల మేరకు లాస్ట్ ఫోన్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
 • * ముందు పోగొట్టుకున్న ఫోన్ నంబర్..ఆ తర్వాత వేరే నంబర్‌ను నమోదు చేయాలి
 • తర్వాత అన్ని పరికరాల నుంచి లాగ్ అవుట్ ఎంపికను ఎంచుకోవాలి
 • దీని తర్వాత పేటీఎమ్ వెబ్‌సైట్‌కి వెళ్లి 24*7 హెల్ప్ ఆప్షన్‌ని ఎంచుకోవాలి
 • దానిలో మీరు రిపోర్ట్ ఏ ఫ్రాడ్ లేదా మెసేజ్ అనే ఆప్షన్‌ని ఎంచుకోవాలి
 • ఆ తర్వాత మీరు పోలీసు రిపోర్ట్‌తో పాటు కొన్ని వివరాలను అందించాలి. అన్ని వెరిఫికేషన్ తర్వాత పేటీఎమ్ యాప్ అకౌంట్ తాత్కాలికంగా మూసివేయబడుతుంది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 4 =