కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన రోజే.. కేసీఆర్‌పై ఏసీబీకి ఫిర్యాదు

ACB Complaint Against KCR on the Day the Congress Government Fell,ACB Complaint Against KCR,KCR on the Day the Congress Government Fell,CM Revanth reddy, Telangana CM, Kaleshwaram Project, Kavitha, KTR, Harish Rao,Mango News,Mango News Telugu,Congress Government Latest News,Congress Government Latest Updates,Congress Government Live News,ACB Complaint News Today,ACB Complaint Latest News,CM Revanth reddy Latest News,CM Revanth reddy Latest Updates
CM Revanth reddy, Telangana CM, Kaleshwaram Project, Kavitha, KTR, Harish Rao

కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని ముందు నుంచి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీ కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు దోచుకుందని పదే పదే చెప్పుకొస్తున్నారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన మొదటిరోజే.. గులాబీ బాస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భారీ షాక్ తగిలింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్‌పై ఏసీబీకి ఫిర్యాదు అందింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన రోజే.. కేసీఆర్‌పై ఏసీబీకి ఫిర్యాదు అందడం సర్వత్రా చర్చనీయాంశమయింది.

కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని.. ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సమగ్ర దర్యాప్తు జరపాలని తెలంగాణ హైకోర్టు న్యాయవాది రాపోల్ భాస్కర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, కాంట్రాక్టర్ మెఘాకృష్ణారెడ్డి, ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లపై కేసు నమోదు చేయాలని భాస్కర్ ఏసీబీని కోరారు. తాగు, సాగు నీటి ప్రాజెక్టు పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా ఆర్థిక అవకతవకలు జరిగాయని.. నకిలీ ఎస్టిమేషన్ల ద్వారా వేలాది కోట్ల ప్రజాధనం దోపిడీకి గురైందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తెలంగాణలో నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు తాగునీరు, సాగునీరు అందించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే నిర్ణయం జరిగిందని భాస్కర్ చెప్పుకొచ్చారు. మొత్తం ప్రాజెక్టు పనులు 7 లింకుల కింద 228 ప్యాకేజీలు నాటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని..  పనులు జరుగుతున్న సమయంలో తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడి.. సీఎంగా కేసీఆర్, మంత్రులుగా హరీష్ రావు, కేటీఆర్, ఎంపీగా కవిత ఎన్నికయ్యారని అన్నారు. ఆ తర్వాత వారంతా కలిసి ప్రాజెక్ట్ అలైన్మెంట్లు, డిజైన్లు మార్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిని, అంచనాలను పెంచారని రాపోల్ భాస్కర్ ఆరోపించారు. అలా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం పేరుతో వేల కోట్లు దోచుకున్నారని.. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపాలని ఏసీబీని కోరారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన రోజే కల్వకుంట్ల ఫ్యామిలీపై కేసు నమోదు కావడంతో.. రేవంత్ రెడ్డి గేమ్ స్టార్ట్ అయిందని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 5 =