కాలుజారి పడిన కేసీఆర్.. యశోద ఆసుపత్రిలో చికిత్స

KCR who slipped was treated at Yashoda Hospital,KCR who slipped,Treated at Yashoda Hospital,BRS Chief KCR Hospitalised,Former Telangana CM K Chandrashekar Rao,Yashoda Hospital Latest News,Yashoda Hospital Latest Updates,Mango News,Mango News Telugu,KCR Latest News,KCR Latest Updates,BRS Party, Telangana Latest News And Updates,Hyderabad News,Telangana News,Telangana CM KCR,KCR at Yashoda Hospital News Today
kcr, yashoda hospital, Surgery, KTR, Kavita, Revanth reddy

గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్‌ యశోద ఆసుపత్రిలో చేరారు. ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో గురువారం అర్థరాత్రి కేసీఆర్ కాలుజారి కిందపడిపోయారు. దీంతో ఆయన కాలికి తీవ్ర గాయమయింది. వెంటనే  సిబ్బంది కేసీఆర్‌ను హుటాహుటిన గ్రీన్ చానెల్ ద్వారా సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రత్యేక వైద్యుల బృందం కేసీఆర్‌కు చికిత్స అందిస్తోంది. ప్రస్తుతం కేసీఆర్ వెంట కేటీఆర్, హరీష్ రావు, కవిత, జోగినపల్లి సంతోష్ కుమార్‌లు ఉన్నారు.

కేసీఆర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం.. యశోద ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. సిటీ స్కాన్ చేసి కేసీఆర్ ఎడమ తుంటి ఎముక విరిగినట్లు గుర్తించామని వైద్యులు ప్రకటించారు. ఎడమ తుంటికి శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఈ మేరకు వైద్యులు ఆపరేషన్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత కేసీఆర్‌కు వైద్యులు మేజర్ సర్జరీ చేయనున్నారు.

మరోవైపు కేసీఆర్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. వైద్యులతో మాట్లాడి కేసీఆర్‌కు మెరుగైన వైద్యం అందివ్వాలని ఆదేశించారు. అలాగే ఎప్పటికప్పుడు కేసీఆర్ ఆరోగ్యంపై సమాచారం ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఆరోగ్యశాఖ కార్యదర్శిని రేవంత్ రెడ్డి యశోద ఆసుపత్రికి పంపించారు. మరోవైపు కేసీఆర్‌కు గాయం కావడంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. కేసీఆర్‌కి గాయం అయ్యిందని తెలిసి బాధపడ్డానని మోడీ పేర్కొన్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని.. ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు మోడీ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =