బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్ లను హౌస్ అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు

BJP MLA, BJP MLA Etala Rajender, BJP MLA Raja Singh, BJP MLA Raja Singh sensational comments, BJP MLA Raja Singh sensational comments on TRS Party, BJP MLAs Etala Rajender and Raja Singh were House Arrested, BJP MLAs Etala Rajender and Raja Singh were House Arrested in Hyderabad, Congress call out Modi’s insult over Telengana formation, Etala Rajender, Hyderabad, Mango News, PM insulted Telangana, PM Modi Comments on Telangana Formation Procedure, PM Modi’s words on Telangana, Protests erupt across Telangana against PM Modi, TRS

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్ లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పార్టీ కార్యకర్తలపై దాడులకు నిరసనగా జనగామలో నేడు మౌన దీక్షకు పిలుపునిచ్చింది బీజేపీ. అయితే, దీనికి అనుమతి లేదని పోలీసులు పలువురు బీజేపీ నాయకులను అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను హైదరాబాద్‌లో గృహ నిర్బంధం చేశారు. కాగా, పోలీసుల తీరుపై ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసులు అధికార టీఆర్ఎస్‌కు తొత్తులుగా మారారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ప్రజానీకం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై మాట్లాడే హక్కు.. వాటిపై నిరసన తెలిపే హక్కు ఒక ప్రజాప్రతినిధిగా తనకు ఉందని రాజేందర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

అలాగే, గోషామహాల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దీనిపై ఆయన పోలీసులపై మండిపడ్డారు. జనగామలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలకు మధ్య జరిగిన ఘర్షణల్లో 9 మంది తమ పార్టీ కార్యకర్తలకు గాయాలయ్యాయని, అందుకే వారిని పరామర్శించేందుకు వెళ్తున్నానని చెప్పినాసరే పోలీసులు అనుమతించట్లేదని ఎమ్మెల్యే రాజాసింగ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దెబ్బలు తిన్న వారి మీదనే తిరిగి పోలీసులు కేసులు పెడుతున్నారని.. కనీసం గాయపడిన వారిని పరామర్శించటానికి కూడా స్వేచ్ఛ లేదని ఈ సందర్భంగా బీజేపీ నాయకులు టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − fourteen =