కరోనా వ్యాప్తి నివారణ : తెలంగాణకు నాలుగు కేంద్ర బృందాలు

Central teams deployed, Centre Covid-19 Monitoring Teams, Centre deploys teams to 15 states, Centre sends teams to 50 municipalities, Centre Teams to 50 Municipalities to Monitor COVID-19 Surge, Coronavirus Live Updates, COVID 19 India, Monitor COVID-19 Surge

దేశంలో లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన తర్వాత కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి మరింతగా విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండి పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్న 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 50 జిల్లాలు/మున్సిపాలిటీలలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ప్రత్యేక బృందాలను నియమించింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి నాలుగు కేంద్ర బృందాలు రానున్నాయి. ఈ బృందాలలో బహుళ నైపుణ్యం ఉన్న వివిధ స్థాయి అధికారులుంటారు. కోవిడ్ -19 నియంత్రించటంలో అక్కడి ప్రభుత్వాలకు అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందించటానికి ఈ బృందాలు కృషిచేస్తాయి.

తెలంగాణ (4)తో పాటుగా మహారాష్ట్ర(7), తమిళనాడు (7), రాజస్థాన్ (5), అస్సాం(6), హర్యానా (4), గుజరాత్(3), కర్నాటక (4), ఉత్తరాఖండ్ (3), మధ్యప్రదేశ్(5), పశ్చిమబెంగాల్(3), ఢిల్లీ (3), బీహార్ (4), ఉత్తరప్త్రదేశ్(4), ఒడిశా(5) రాష్ట్రాలలోని జిల్లాలు/మున్సిపాలిటీలకు కేంద్ర బృందాలు వెళ్లనున్నాయి. ముగ్గురేసి సభ్యులతో కూడిన ఈ బృందాలలో ఇద్దరు ప్రజారోగ్య నిపుణులు/అంటువ్యాధుల నిపుణులు/ వైద్యులు, ఒకరి పాలనాపరమైన విధులు నిర్వహించే జాయింట్ సెక్రెటరీ స్థాయి నోడల్ అధికారి అంటారు.

ఈ బృందాలు క్షేత్ర స్థాయిలో పనిచేస్తూ అక్కడి వ్యవహారాల మెరుగుదలకు కృషి చేస్తాయి. రాష్ట్రప్రభుత్వాల వైద్య కేంద్రాలకు వెళ్ళి తగిన సహాయం అందించేందుకు, తద్వారా మెరుగైన చికిత్స అందటానికి, కోవిడ్ నియంత్రణకు, నివారణకు సాయపడతాయి. మరింత మెరుగైన సమన్వయం సాధించటానికి, క్షేత్ర స్థాయిలో వేగవంతమైన చర్యలకు నిశితమైన వ్యూహాన్ని అనుసరించటానికి ఈ బృందాలు సహాయపడతాయని చెప్పారు. పడకల కొరత, పెరుగుతున్న పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య, ఆకస్మికంగా కేసులు పెరగటం లాంటి సమస్యల విషయంలో తగిన చర్యలు తీసుకోవటానికి ఈ బృందాలు సహాయపడతాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =