కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మాతృవియోగం.. సంతాపం తెలిపిన ప్రధాని మోదీ

Congress President Sonia Gandhis Mother Paola Maino Passes Away in Italy PM Modi Offers Condolences, Sonia Gandhis Mother Passes Away, Sonia Gandhi Mother Paola Maino Died, Sonia Gandhi Mother Passes Away In Italy, Mango News, Mango News Telugu, Congress president Sonia Gandhi, PM Narendra Modi Offers Condolences, Sonia Gandhi Latest News And Updates, PM Narendra Modi News And Live Updates, Paola Maino Sonia Gandhi Mother, Paola Maino

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆమె మాతృమూర్తి ‘పావోలా మైనో’ ఇట‌లీలోని త‌న నివాసంలో క‌న్నుమూశారు. ఈ మేరకు ఆగ‌స్టు 27న పావోలా మైనో తుదిశ్వాస విడిచార‌ని, ఆమె అంత్యక్రియలు మంగళవారం ముగిశాయని కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, కాంగ్రెస్ పార్టీ క‌మ్యూనికేష‌న్స్ ఇన్‌చార్జ్ జ‌న‌ర‌ల్ సెక్రెట‌రీ జైరామ్‌ రమేష్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. ఈ క్రమంలో తన తల్లి అంత్యక్రియలకు సోనియా గాంధీ ఇటలీ వెళ్లినట్లుగా సమాచారం. ఇక గతంలో ఒకసారి తన తల్లికి అనారోగ్యంగా ఉండటంతో సోనియా గాంధీ ఇటలీకి వెళ్లి వచ్చారు. ఇట‌లీ దేశానికి చెందిన సోనియా గాంధీని మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇక సోనియా గాంధీకి మాతృవియోగం ఘటనపై పలువురు రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలుపుతున్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా దీనిపై స్పందించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్‌లో సంతాపం తెలియజేశారు. ‘సోనియా గాంధీజీ తల్లి శ్రీమతి పావోలా మైనో మరణించినందుకు ఆమెకు నా సంతాపం. పావోలా మైనో ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఈ తీవ్ర దుఃఖ సమయంలో, నా ఆలోచనలు మొత్తం శ్రీమతి సోనియా గాంధీజీ కుటుంబంతో ఉన్నాయి’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here