ఆ 30 నియోజకవర్గాలలో పోటాపోటీ

Telangana Assembly Election 2023,Competition, 30 constituencies, Gangula Kamalakar, Jagadish Reddy, Rasamai Balakishan, Srinivas Goud, Sabita Indra Reddy,Konda Surekha, Ram Reddy Damodar Reddy, Ponnam Prabhakar, Shabbir Ali, Mainampally Hanumantha Rao,Bandi Sanjay, Dharmapuri Arvind, Raghunandan Rao, NVSS Prabhakar,
Telangana Assembly Election 2023,Competition, 30 constituencies, Gangula Kamalakar, Jagadish Reddy, Rasamai Balakishan, Srinivas Goud, Sabita Indra Reddy,Konda Surekha, Ram Reddy Damodar Reddy, Ponnam Prabhakar, Shabbir Ali, Mainampally Hanumantha Rao,Bandi Sanjay, Dharmapuri Arvind, Raghunandan Rao, NVSS Prabhakar,

తెలంగాణలో పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్దులు ఎన్నికల ప్రచారాలతో దూసుకుపోతున్నారు.  ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీతో పాటు, ప్రతిపక్షపార్టీలయినన  కాంగ్రెస్, బీజేపీ  అభ్యర్థుల  మధ్య నువ్వా నేనా అన్నట్లుగా మాటల యుద్ధం కొనసాగుతోంది.  అధికారంలో ఉండి చేయలేకపోయిన పనులను కాంగ్రెస్, బీజేపీలు హైలెట్ చేస్తుండగా.. తాము  చేసిన, చేయబోయే అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్తూ బీఆర్ఎస్ నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు.

మరోవైపు తెలంగాణలో మొత్తం 119 స్థానాలున్నాయి.  అంతేకాదు మజ్లిస్ పార్టీ గెలిచే 6 లేదా 7 స్థానాలను వదిలేస్తే మిగిలిన 112 స్థానాలలో ..60 స్థానాలు గెలిస్తే చాలు.. అంటే మేజిక్ ఫిగర్ 60 అన్నమాట. అయితే ఈ 112 స్థానాలలో  30 స్థానాల్లో త్రిముఖ పోరు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

తెలంగాణలో 30 స్థానాలలో టఫ్ ఉండబోతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఖైరతాబాద్, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, మల్కాజిగిరి ,  శేరిలింగంపల్లి, ఉప్పల్, రాజేంద్రనగర్, పటాన్ చెరు   మహేశ్వరం,  కరీంనగర్, మానకొండూరు, వేములవాడ, జగిత్యాల, హుజురాబాద్,వరంగల్ తూర్పు,కల్వకుర్తి,ముథోల్,  ఆర్మూర్,  ఆదిలాబాద్,నిర్మల్, చొప్పదండి,మంథని,కోరుట్ల,నిజామాబాద్ అర్బన్,ఖానాపూర్,సిర్పూర్, హుస్నాబాద్,కామారెడ్డి,సూర్యాపేట,మహబూబ్‌నగర్ స్థానాలున్నట్లు  విశ్లేషకులు చెబుతున్నారు

ముఖ్యంగా ప్రధాన పార్టీలలో అభ్యర్ధుల మధ్య త్రిముఖ పోరు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ త్రిముఖ పోరు ఎదుర్కొంటున్న వారిలో తెలంగాణ నుంచి పోటీకి దిగిన మంత్రులు గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి, రసమయి బాలకిషన్, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి,మంత్రి కేటీఆర్ ఫ్రెండ్ భూక్యా జాన్సన్ రాథోడ్ ఉన్నారు. అలాగే  కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన  కొండా సురేఖ, రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్,షబ్బీర్ అలీ, మైనంపల్లి హనుమంతరావు,  విజయా రెడ్డి  వంటి నేతలు ఉన్నారు.

అలాగే బీజేపీ నుంచి బరిలో దిగిన బండి సంజయ్, ధర్మపురి అరవింద్,  రఘునందన్ రావు, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు,  బొడిగే శోభ, తల్లోజు ఆచారి ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.  వీరంతా కీలక నేతలు కావడంతో  ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా అయినా గెలిస్తేనే భవిష్యత్తులలో తమ సత్తా చాటే అవకాశం ఉండటంతో ప్రతీ ఒక్కరూ రేయింబవళ్లు గెలుపు కోసం ఆరాటపడుతున్నారు. ప్రచారాలతో దూసుకుపోతూ ప్రజలలో మమేకం అవుతూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 17 =