కరోనా వ్యాక్సిన్ కోసం హెల్త్ వర్కర్స్, పోలీస్, శానిటేషన్ సిబ్బంది జాబితా తయారీకి సీఎస్ ఆదేశం

CS Somesh Kumar Chaired A Meeting Of State Level Steering Committee For COVID-19 Vaccine,Somesh Kumar,Chief Secretary,Chief Secretary Somesh Kumar,Telangana State Portal,Telangana State,Telangana,COVID-19,Coronavirus,COVID-19 Vaccine,Coronavirus Vaccine,CS Somesh Kumar,CS Somesh Kumar Latest News,Mango News,Mango News Telugu,CS Somesh Kumar Chaired A Meeting Of State Level Steering Committee,State Level Steering Committee,Officials Start Compiling List For COVID-19 Vaccine,Chief Secretary Somesh Kumar Committee For COVID-19 Vaccine

తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ నిమిత్తం మొదటి ప్రాధాన్యతగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన ఆరోగ్య కార్యకర్తలు , పోలీస్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బందితో కూడిన డేటా బేస్ తయారు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశించారు. సీఎస్ సోమేశ్ కుమార్ అద్యక్షతన రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటి మొదటి సమావేశం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో గురువారం నాడు జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో కోవిడ్ -19 వ్యాక్సినేషన్ సన్నద్ధతపై కమిటీ చర్చించింది. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, కోవిడ్ -19 మొదటి దశ వ్యాక్సినేషన్ కోసం సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేసి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరారు. కోవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించి కోల్డ్ చైన్ సౌకర్యాలు, రవాణా, వైద్య సిబ్బంది శిక్షణ, లాజిస్టికల్ ఏర్పాట్లు, ఐ.ఇ.సి. ప్రచారం, వైద్య సౌకర్యాల మ్యాపింగ్ తదితర అంశాలపై సీఎస్ సమీక్షించారు. వ్యాక్సినేషన్ సెంటర్ల నిర్వహణకు అవసరమైన ప్రోటోకాల్ ను తయారుచేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, అడిషనల్ డిజి (లా అండ్ ఆర్డర్) జితేందర్, యువజన సర్వీసుల ముఖ్యకార్యదర్శి సబ్యసాచి ఘోష్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, డిజాస్టర్ మేనేజ్ మెంట్ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, మైనార్టీ కార్యదర్శి అహ్మద్ నదీం, గిరిజన శాఖ కార్యదర్శి క్రిస్టినా చొంగ్తు, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య మరియు యూనిసెఫ్, యూఎన్డిపీ, డబ్య్లుహెఛ్ఓ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =