వాహనాల్లో తెలంగాణలోకి వచ్చే వ్యక్తులకు ఈ-పాస్‌ ఉంటేనే అనుమతి

All vehicles entering Telangana will need an e-pass, DGP Mahender Reddy Issued Instructions for Entry of Vehicles into the Telangana, DGP Mahender Reddy Issued Instructions for Entry of Vehicles into the Telangana State, Enforce lockdown strictly in Telangana, Food Delivery Staff, Mango News, Special passes to be issued for emergency travel, Telangana Govt Exempts ecommerce, Telangana Lockdown, Telangana Police seize vehicles of lockdown violators, vehicles entering Telangana will need an e-pass, Vehicles will be seized during lockdown

కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్దగల చెక్ పోస్టుల వద్ద పాటించాల్సిన నియమాలు, వాహనాల ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి సోమవారం నాడు సూచనలు జారీ చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి వచ్చే అంబులెన్స్ వాహనాలను ఈ-పాస్ ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా రాష్ట్రంలోకి అనుమతించాలని చెప్పారు.

ఇక వాహనాల్లో ప్రయాణించే వ్యక్తులందరికి తెలంగాణలోకి ప్రవేశించాలంటే తప్పనిసరిగా సంబంధిత రాష్ట్రాల అధికారులు జారీ చేసిన ఈ-పాస్‌ లేదా తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన ఈ-పాస్ ఉంటేనే రాష్ట్రంలో అనుమతిస్తామని పేర్కొన్నారు. అంబులెన్స్ మరియు ఇతర అనుమతి ఉన్న వాహనాల కోసం రాష్ట్రంలోకి సజావుగా ప్రవేశించడానికి సరిహద్దుల వద్ద సరైన సంకేతాలతో ప్రత్యేక లేన్/దారి ఏర్పాటు చేయబడుతుందని తెలిపారు. అధికారులంతా ఈ సూచనలను తప్పకుండా అమలుచేయాలని, అలాగే చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వహించే అధికారులకు కూడా ఈ సూచనలను వివరించాలని డీజీపీ మహేందర్ రెడ్డి మెమోరాండంలో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =