గ్రేటర్ ఎన్నికల్లో 46.68 శాతం పోలింగ్, ఈసారే అత్యధికం

GHMC Elections: Final Voting Percentage Recorded As 46.68%,GHMC Elections,GHMC Elections 2020,GHMC Elections 2020 Latest News,GHMC Elections 2020 Updates,GHMC Elections Latest Updates,GHMC Elections Voting,GHMC Polling Updates,GHMC Polls,Mango News,#GHMCElections2020,GHMC Elections News,GHMC Polling Process Completed,GHMC Final Voting Percentage Recorded As 46.68%,GHMC Voting Percentage,GHMC 2020,GHMC Elections Final Voting Percentage

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో మంగళవారం నాడు 149 డివిజన్లలో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఎన్నికల్లో గతంలోకంటే పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. 149 డివిజన్లకు గానూ 46.68  శాతం పోలింగ్‌ నమోదయినట్టు జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి లోకేష్‌ కుమార్‌ ప్రకటించారు. 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 45.29 శాతం, 2009 లో 42.02 శాతం పోలింగ్ నమోదయింది. గత ఎన్నికలతో పోల్చితే 1.39 శాతం పోలింగ్ అధికంగా నమోదయినట్టు ప్రకటించారు. మరోవైపు ఇప్పటివరకు జరిగిన అన్ని జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఈసారే అత్యధిక పోలింగ్ శాతం నమోదయింది.

అత్యధికంగా పోలింగ్ నమోదైన పలు డివిజన్లు ఇవే:

  • కంచన్‌బాగ్‌ – 70.39
  • ఆర్ సి పురం – 67.71 %
  • పటాన్ చెరు – 65.77 %
  • భారతి నగర్ – 61.89 %
  • గాజులరామారం – 58.61 %
  • నవాబ్ సాహెబ్ కుంట – 55.65 %
  • బౌద్ధనగర్ – 54.79 %
  • దత్తాత్రేయనగర్ – 54.67 %
  • రంగారెడ్డి నగర్ – 53.92 %
  • జంగంమెట్ – 53.80 %
  • బేగం బజార్ – 53.64 %
  • శాలిబండ – 53.49 %
  • నాగోల్ – 53.18 %
  • చర్లపల్లి – 53.14 %
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + twenty =