కేసీఆర్ వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది: రాజనర్సింహ

Government will bear all the medical expenses of KCR says Rajanarsimha,Government will bear all the medical expenses,medical expenses of KCR says Rajanarsimha,medical expenses of KCR,KCR, KCR in Hospital, Yashoda Hospital, CM Revanth reddy, Health minister Rajanarsimha,Congress government will bear brs,Mango News,Mango News Telugu,Health minister Rajanarsimha Latest News,Health minister Rajanarsimha Latest Updates,KCR Latest News,KCR Latest Updates
KCR, KCR in Hospital, Yashoda Hospital, CM Revanth reddy, Health minister Rajanarsimha

సాధారణంగా అధికారం దక్కగానే అధికార పక్షాలు.. రాజకీయ ప్రత్యర్థులను వేటాడే పనిలో పడుతాయి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు, వ్యవహార శైలి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాయపడి ఆసుపత్రిలో ఉన్నారని తెలిసి.. రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి ఆయన్ను పరామర్శించారు. అంతకంటే ముందు కేసీఆర్ అంటేనే ఒంటికాలు మీద ఎగిరే రేవంత్ రెడ్డి.. ఆయన ఆసుపత్రిలో ఉన్నారని తెలిసి వెళ్లి కలిసొచ్చారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ ఇలా పరామర్శించిన దాఖలాలు లేవు.

ఇదిలా ఉండగా కేసీఆర్‌కు సంబంధించి కాంగ్రెస్ సర్కార్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించనుంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కీలక ప్రకటన చేశారు. కేసీఆర్ వైద్య ఖర్చులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. అంతేకాకుండా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక అధికారిని కూడా నియమించినట్లు చెప్పారు. కేసీఆర్ ఆసుపత్రి ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని రాజనర్సింహ చేసిన ప్రకటన ప్రస్తుత రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

ఇకపోతే పోయిన వారం కేసీఆర్ ఎర్రవెళ్లిలోని తన ఫామ్‌హౌజ్‌లో కాలు జారి కిందపడ్డారు. దీంతో ఆయన తుంటి ఎముక విరిగిపోయింది. వెంటనే సిబ్బంది కేసీఆర్‌ను సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. ఆ మరునాడు వైద్యులు కేసీఆర్‌ ఎడమ కాలు తుంటి మార్పిడి ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో.. శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కుటుంబ సభ్యులు కేసీఆర్‌ను బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో ఉన్న తన పాత నివాసానికి తీసుకెళ్లారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + eight =