నెలలో ఒకరోజు పీహెచ్‌సీల్లో నిద్ర చేయాలి, జిల్లా వైద్యాధికారులకు మంత్రి హరీశ్ రావు ఆదేశాలు

Health Minister Harish Rao held Teleconference with DMHOs over PHCs Performance, Minister Harish Rao held Teleconference with DMHOs over PHCs Performance, Harish Rao held Teleconference with DMHOs over PHCs Performance, Telangana Health Minister Harish Rao held Teleconference with DMHOs over PHCs Performance, Teleconference with DMHOs over PHCs Performance, Telangana Health Minister Harish Rao held Teleconference with DMHOs, PHCs Performance, Telangana Health Minister Harish Rao, Health Minister Harish Rao, Minister Harish Rao, Telangana Health Minister, Harish Rao, Telangana Minister Harish Rao, PHCs Performance News, PHCs Performance Latest News, PHCs Performance Latest Updates, PHCs Performance Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు నెలవారీ సమీక్షలో భాగంగా ఆదివారం నాడు రాష్ట్రంలో పీహెచ్‌సీల పనితీరుపై అన్ని జిల్లాల డీఎంహెచ్‌ఓలు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు, సూపర్‌వైజర్లు, ఇతర సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, డీఎంహెచ్‌ఓలు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు ప్రతి నెల వారి పరిధిలోని అన్ని పీహెచ్‌సీ లను తప్పనిసరిగా సందర్శించాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే వారు నెలలో ఒక రోజు పీహెచ్‌సీలలో నిద్ర చేయాలని సూచించారు. తానూ కూడా పీహెచ్‌సీ లలో నిద్ర చేస్తానని మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

హెచ్ఓడీలు నెలవారీ సమీక్షలు చేసుకోవాలని, సిజెరియన్ల రేటు గణనీయంగా తగ్గించాలని అన్నారు. వచ్చే నెల నాటికి పనితీరు మరింత మెరుగుపడాలని, లేకుంటే చర్యలు తప్పవన్నారు. ఇక సిజెరియన్ల విషయంలో తీరు మార్చుకొని ప్రైవేటు ఆసుపత్రులపై మెడికల్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేయాలని అన్నారు. మరోవైపు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో భాగంగా ఇంటింటా కరోనా వాక్సిన్ ఇవ్వాలని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − two =