మెట్రో ప్రయాణికులకు శుభవార్త, ప్రయాణ ఛార్జీల్లో 40 శాతం రాయితీ

Hyderabad Metro, Hyderabad Metro Fare News, Hyderabad Metro Fare Updates, Hyderabad Metro Latest News, Hyderabad Metro offers discount, Hyderabad Metro offers discounts on passenger fares, hyderabad metro rail limited, Hyderabad Metro Services, Metro, Metro fare concession News, Metro Fare News

కరోనా లాక్ డౌన్ అనంతరం హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైలు సేవలు తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దసరా పండుగ సందర్భంగా మెట్రో రైలు ప్రయాణికులకు మరో శుభవార్త అందించారు. ప్రయాణ ఛార్జీల్లో 40 శాతం రాయితీలు ప్రకటించారు. అందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్‌ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి శుక్రవారం నాడు మీడియాకు వెల్లడించారు. అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 31 వరకు మెట్రో చార్జీల్లో రాయితీ వరిస్తుందని పేర్కొన్నారు.

స్మార్ట్‌ కార్డు ద్వారా 14 ట్రిప్పుల ఛార్జీతో 30 రోజుల్లో 20 ట్రిప్పులు తిరిగే అవకాశం కల్పిస్తున్నామన్నారు. అలాగే 20 ట్రిప్పుల ఛార్జీలతో 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం, 40 ట్రిప్పుల ఛార్జీతో 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరిగే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. ఇక టి సవారీ మొబైల్ యాప్ ద్వారా కూడా ప్రయాణ చార్జీల్లో రాయితీలు ఇస్తున్నట్టు ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − five =