మే 5న సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న మమతా బెనర్జీ

Mamata Banerjee to be Sworn in as West Bengal CM on May 5th,Mango News,Mango News Telugu,West Bengal Assembly Polls,Mamata Banerjee Likely To Be Sworn In As CM On May 5,Mamata Banerjee To Take Oath As West Bengal Chief Minister On May 5,Mamata Banerjee To Take Oath As West Bengal CM On 5Th May,Bengal Election Result,Mamata Banerjee To Take Oath As CM For Third Time On May 5,West Bengal Assembly Election,West Bengal Assembly Election 2021,Mamata Banerjee To Take Oath As Bengal CM,West Bengal,West Bengal Election,West Bengal CM,Mamata Banerjee,CM Mamata Banerjee,Mamata Banerjee Latest News,Mamata Banerjee News,Mamata Banerjee Live Updates,West Bengal Election 2021

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బెంగాల్లో 292 అసెంబ్లీ స్థానాలకు గాను తృణమూల్ కాంగ్రెస్ 213 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో స్పష్టమైన మెజార్టీతో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి సీఎం బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. మే 5, బుధవారం రాత్రి 7 గంటలకు మమతా బెనర్జీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు టీఎంసీ సీనియర్‌ నేత పార్థ ఛటర్జీ ప్రకటించారు. సోమవారం నాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన టీఎంసీ ఎమ్మెల్యేలంతా సమావేశమై తమ శాసనసభాపక్ష నేతగా మమతా బెనర్జీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మమతా బెనర్జీ బెంగాల్ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ ను కలవనున్నట్లు తెలుస్తుంది. బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here