మెడికల్ సీట్ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో వసతులపై మంత్రి ఈటల సమీక్ష

Minister Etala Rajender Held Review with Health Department Officials,Etela Rajender,Health Minister of Telangana,Health Minister of Telangana State,Health Minister Etala Rajender,Etala Rajender Held Review With Health Department Officials,Etala Rajender Held Review with Health Department,Health Department Officials,Mango News,Mango News Telugu,Health Minister Etala Rajender Held Review with Health Department Officials,Minister Etala Rajender Review with Health Department Officials,Telangana,Telangana News,Minister Etala Rajender Latest News,Minister Etala Rajender Held Review,Etala Rajender News

తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ సీట్ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రిన్సిపల్స్, డాక్టర్స్, మెడికల్ కాలేజీల హాస్పిటల్ ల సూపరింటెడెంట్ లతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ గురువారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉన్న మౌలికవసతులు, అధ్యాపకులు, స్టాఫ్, సమస్యలపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తాజా విధివిధానాలకు అనుగుణంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అన్ని వసతులు ఉండేలా చూడాలని సూచించారు.

చిన్న జబ్బులకు పెద్ద ఆసుపత్రులకు రాకుండా పిహెచ్‌సి, ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లోనే చికిత్స ఏర్పాట్లు:

“వైద్య ఆరోగ్యశాఖ అత్యవసర శాఖ. బంద్ లు, ధర్నాలు జరిగిన కూడా వైద్య ఆరోగ్య సిబ్బంది 365 రోజులు పనిచేస్తున్నారు. కరోనా సమయంలో పూర్తి స్థాయిలో ప్రజలకు సేవ చేసినం. కరోనా సమయంలో కూడా క్యాన్సర్, డయాలసిస్, తలసిమియ లాంటి జబ్బులకు అంతరాయం లేకుండా వైద్య సేవలు అందిచాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వరకు అన్ని హాస్పిటల్ లు ఒక చైన్ లాగా పని చేయాలి. చిన్న చిన్న జబ్బులకు పెద్ద ఆసుపత్రులకు రాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఏరియా ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రుల్లో చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లా మెడికల్ కాలేజీల్లో అన్ని రకాల చికిత్స అందించాలని కేవలం అత్యవసర, క్లిష్ట సమస్యలకి మాత్రమే పెద్దాసుపత్రిలకు పంపించాలి. అన్ని మెడికల్ కాలేజ్ ఆసుపత్రుల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, శానిటేషన్ ఇబ్బందులు తలెత్తకుండా సూపరింటెండెంట్ చూడాలి. ఆరోగ్య శ్రీ సేవలు మరింత మెరుగుపరచాలి. కరోనా సమయంలో శక్తి వంచన లేకుండా పని చేసిన మెడికల్ కాలేజ్ ల సిబ్బంది అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డా రమేష్ రెడ్డి, టిఎస్ఎంఐడిసీ ఎండి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 7 =