తెలంగాణలో గ్రీన్ జోన్ లోకి మరో 14 జిల్లాలు

14 More Orange Zone Districts Set to Turn as Green Zone, Green Zones Districts List In Telangana, Minister Etala Rajender, Orange Zone Districts List In Telangana, telangana, Telangana Corona Green Zones, Telangana Corona Orange Zones, Telangana Coronavirus, Telangana Coronavirus Deaths, Telangana Health Minister Etala Rajender, Total COVID 19 Cases

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు, పాజిటివ్ కేసుల సంబంధిత విషయాలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. మే 8, శుక్రవారం నాడు 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 1132 పాజిటివ్ కేసులు నమోదవగా, 727 మంది డిశ్చార్జ్ అయ్యారు. శుక్రవారం ఒక్కరోజే 34 మంది డిశ్చార్జ్ అయ్యారని, ఇప్పటివరకు 29 మంది మరణించారని చెప్పారు. ప్రస్తుతం 376 మంది గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు.

రాష్ట్రం లో 33 జిల్లాల్లో 9 జిల్లాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయి. మరో 14 జిల్లాల్లో కరోనా కేసులు లేవు కాబట్టి వాటిని కూడా గ్రీన్ జిల్లాలుగా ప్రకటించాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. సూర్యాపేట,వరంగల్ అర్బన్,నిజామాబాద్ జిల్లాలను ఆరెంజ్ జోన్ లో చేర్చాలని కోరామని తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి,మేడ్చల్ జిల్లాలు మాత్రమే రెడ్ జోన్ లో ఉన్నాయి. వీటిల్లో కూడా హైదరాబాద్ ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో మాత్రమే పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని మంత్రి అన్నారు. రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పట్టాయి అని, అందుకే పరీక్షలు తక్కువ చేస్తున్నామని ఇదే విషయం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లోకూడా చర్చించామని మంత్రి అన్నారు. కేంద్ర మంత్రి పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు.

పరీక్షలు ఎవరికి పడితే వారికి చేయవద్దు అని సెంట్రల్ గవర్నమెంట్ మార్గానిర్దేశకాలు ఇచ్చిందని, పాజిటివ్ కేసులతో కలిసిన వారిలో కరోనా లక్షణాలు ఉన్నవారికి మాత్రమే టెస్ట్ చేయాలని,లక్షణాలు లేనివారిని 14 రోజులపాటు పర్యవేక్షణలో ఉంచాలని..అదే వయసు మళ్లిన వారు,ఇతర జబ్బులతో ఉన్నవారు, గర్భిణీ స్త్రీ లకి పరీక్షలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఎక్కువ కేసులు ఉన్నప్పుడు వారి కాంటాక్ట్ పర్సన్స్ ఎక్కువమంది ఉంటారు కాబట్టి ఎక్కువ పరీక్షలు చేశాము, ఇప్పుడు తక్కువ కేసులు ఉన్నాయి కాబట్టి తక్కువమందికి పరీక్షలు చేస్తున్నామని మంత్రి వివరించారు. దీనిపై పసలేని వాదనలు చేయవద్దని కోరారు.

శుక్రవారం నాడు గాంధీ ఆసుపత్రిలో కరోనా సోకిన కాలాపత్తర్ కి చెందిన 27 ఏళ్ల గర్భవతి కి సిజేరియన్ ద్వారా డెలివరీ చేయగా బాబు పుట్టారు. తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. డిశ్చార్జ్ అయిన వారిలో అనేక ఇతర ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్న 75 సంవత్సరాల వ్యక్తి , డయాలసిస్ చేయించుకుంటూ చావు బ్రతుకుల్లో ఉన్న మరో కరోనా పాజిటివ్ పేషంట్ కి సైతం చికిత్స చేసి ఇంటికి పంపించామని మంత్రి ఈటల రాజేందర్ తెలియజేశారు. గాంధీ వైద్యులు గొప్పగా పనిచేస్తున్నారు అనడానికి ఇంతకంటే ఎక్కువ సజీవ సాక్ష్యం ఏంకావాలి అన్నారు .

కరోనా కేసులు తగ్గినా కూడా ఎట్టి పరిస్థితుల్లో రిలాక్స్ అవ్వవద్దని సీఎం కేసీఆర్ కోరారని, కంటైన్మెంట్ జోన్స్ లో మరింత కఠిన చర్యలు చేపట్టి వైరస్ వ్యాప్తి కి అడ్డుకట్ట వేయాలని సూచించారని తెలిపారు. ప్రతి రోజు రెండు గంటలపాటు టెలీ ఫోన్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు. హైదరాబాద్ లో ముప్పై సర్కిల్ లు ఉంటే ఎనిమిది సర్కిల్ లో రెడ్ జోన్ లో ఉన్నాయని అక్కడ పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలుచేస్తున్నామని మంత్రి అన్నారు. ఇతర దేశాలు, జిల్లాల నుండి వచ్చేవారిని హోమ్ క్వారంటైన్ లో ఉంచుతామన్నారు. ఎయిర్ పోర్ట్ లోనే స్క్రీనింగ్ చేస్తామన్నారు. లక్షణాలు ఉంటే పరీక్షలు చేస్తామని తెలిపారు. రోడ్డు మార్గంలో వచ్చేవారిని బోర్డర్స్ లోనే చెక్ చేస్తున్నామని అన్నారు. కోవిడ్ మరణాల కంటే ఆకలితో, నడిచి వెళ్ళేవారు ఎక్కువ సంఖ్యలో చనిపోతున్నారు కనుక తొందరగా సాధారణ స్థితి రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. అన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపి సేవలు పూర్తి స్థాయిలో నడుస్తున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా జాగ్రత్తలు పాటిస్తూ ఓపి చూసుకోవాలని కోరినట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

[subscribe]
Video thumbnail
Etela Rajender Superb Answer To Reporter Over Traffic Jams In Hyderabad | #Covid19 | Mango News
07:31
Video thumbnail
Minister Etela Rajender About New Green Zone Districts In Telangana | #CoronaVirus | Mango News
07:38
Video thumbnail
Minister Etela Rajender Says Corona Positive Woman Safely Delivers Baby | #Covid19 | Mango News
05:58
Video thumbnail
CM KCR Serious Comments On Opposition Parties | #CoronaOutbreak | #TelanganaLockdown | Mango News
07:33
Video thumbnail
CM KCR Asks Apologies To Muslims For Facing Problems In Ramadan Month | #CoronaVirus | Mango News
10:12
Video thumbnail
CM KCR About Providing Salaries For Govt Employees | #LockdownUpdates | Telangana News | Mango News
11:16
Video thumbnail
CM KCR Face To Face Challenge For Congress Leaders In Press Meet | TRS Vs Congress | Mango News
11:45
Video thumbnail
హైదరాబాద్ ప్రజలు నన్ను క్షమించాలి | CM KCR About His Apologies For Hyderabad People In Press Meet
05:06
Video thumbnail
CM KCR Says Karimnagar Stands Ideal For Control Of Corona | #Corona | #TelanganaLockdown | MangoNews
05:38
Video thumbnail
CM KCR Mentioned Corona Vaccine Will Get Ready By August | #Covid19 | #LockdownUpdates | Mango News
08:34
Video thumbnail
మే 29 వరకు తెలంగాణ లాక్ డౌన్ పొడిగింపు | Lockdown Will Be Extended To May 29 Says CM KCR | MangoNews
09:25
Video thumbnail
CM KCR About Manufacturing Of Covid19 Medicine In Hyderabad | #KCRPressMeet | #TelanganaLockdown
06:59
Video thumbnail
Talasani Srinivas Yadav About Movie Shootings After Lockdown | #TelanganaLockdown | Mango News
11:34
Video thumbnail
MP Revanth Reddy Emotional Speech About Koheda Farmers Problems | Telangana News | Mango News
03:22
Video thumbnail
Uttam Kumar Reddy Demands 10 Lakhs Relief To Each Family In Telangana | #CoronaVirus | Mango News
05:42
Video thumbnail
Uttam Kumar Reddy Says Less Number Of Corona Tests Conducted In Telangana | #Covid19 | Mango News
05:39
Video thumbnail
Minister Etela Rajender Fires On Opposition Over Cheap Politics | #Corona | #Lockdown | Mango News
13:06
Video thumbnail
Etela Rajender Excellent Words About Daily Wage Workers In Telangana | #CoronaVirus | Mango News
06:47
Video thumbnail
Minister Etela Rajender Says To Visit King Koti Hospital For Corona Tests | #Covid19 | Mango News
06:59
Video thumbnail
CM KCR Vs MP Revanth Reddy | CM KCR Thanked Donars | MP Revanth Redddy Donates 50 Lakhs | Mango News
08:29
Video thumbnail
Etela Rajender Gives Clarity Over Lockdown Extension In Telangana | #CoronavirusOutbreak | MangoNews
06:34
Video thumbnail
Minister Etela Rajender Responds Over Accusation Made By Oppositions | #CoronaVirus | Mango News
09:24

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 1 =