రైతుబంధు కింద నేడు తొలిరోజు 21 వేల మంది రైతుల ఖాతాల్లో రూ.607 కోట్లు జమ చేస్తున్నాం – మంత్రి హరీష్ రావు

Minister Harish Rao Announces Rs. 607 Cr of Rythu Bandhu Amount Credited into 21000 Farmers Accounts on First Day,Rythu Bandhu will Deposit,CM KCR 100 Cr for Kondagattu Anjanna Temple,Kondagattu Anjanna Temple Devolepment,Kondagattu Anjanna Temple,Rythu Bandhu,Telangana Rythu Bandhu,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణ ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి కోసం సాయం అందించే ‘రైతుబంధు’ పథకాన్ని పదో విడుతను బుధవారం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా యాసంగి సీజన్‌కు సంబంధించి రైతులకు పెట్టుబడి సాయం కింద తొలిరోజున 21 వేల మంది రైతుల ఖాతాల్లో రూ.607 కోట్లు జమ చేస్తున్నట్లు ప్రకటించారు మంత్రి హరీష్ రావు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 70.54 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.7,676 కోట్లు జమ చేయనున్నామని ఆయన తెలిపారు. దీనిలో భాగంగా నేడు ఎకరం వరకు భూమి ఉన్న 21,02,822 మంది రైతుల ఖాతాల్లో రూ.607.32 కోట్లు జమ చేస్తున్నట్లు చెప్పిన మంత్రి, పెట్టుబడి మద్దతు ఎకరాకు రూ.5 వేల చొప్పున అందజేస్తున్నామని వెల్లడించారు.

కాగా రైతులందరికీ రైతుబంధు నిధులను ఎలాంటి తగ్గింపులు లేకుండా పూర్తి స్థాయిలో సకాలంలో విడుదల చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గత వారం ఆర్థిక శాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాల మేరకు ఈ సీజన్‌లో 1.53 కోట్ల ఎకరాలకు సాయం అందించనున్నట్లు అధికారులు తెలిపారు. రైతుబంధు పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వానాకాలం, యాసంగి (ఖరీఫ్, రబీ) సీజన్‌లలో ఎకరాకు రూ.10,000 చొప్పున ఏటా రెండు విడతలుగా పంట పెట్టుబడి సాయం అందజేన్నట్లు అధికారులు వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + seven =