రైతుల బతుకు బాగుపడాలంటే బీజేపీని గద్దె దించాల్సిందే: మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao Participated in a Protest Against Anti-farmers Policies of BJP Govt,Minister Harish Rao Participated in a Protest Against Anti-farmers Policies ,Protest Against Anti-farmers Policies of BJP Govt,TS Minister Harish Rao,TRS burns PM Modi's effigies, Mango News, MangoNews, Paddy Procurement, Paddy procurement In Telangana, Paddy procurement issue, Paddy Procurement Issue In Telangana, Paddy Procurement Protest, Paddy Procurement Protest Against Central Government, Paddy Procurement Protest Against Central Government In Delhi, Telangana paddy row, TRS All Set To Intensify Paddy Procurement Protest Against Central Government, TRS All Set To Intensify Paddy Procurement Protest Against Central Government In Delhi, TRS protests Over Paddy Procurement Issue,Harish Rao

ధాన్యం కొనుగోలుపై కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా డిసెంబర్ 20, సోమవారం నాడు ఊరూరా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు, రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నాయి. కేంద్రం వైఖరికి నిరసన తెలుపుతూ గ్రామాల్లో చావు డప్పు వేస్తూ, నల్ల జెండాలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలుపుతున్నారు. ఈ నిరసనలో భాగంగా సిద్ధిపేట జిల్లాలోని గజ్వేల్‌ లో జరిగిన ధర్నాలో రాష్ట్ర ఆర్థిక, వైద్య శాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొని మాట్లాడారు.

రైతుల బతుకు బాగుపడాలంటే బీజేపీని గద్దె దించాల్సిందే: మంత్రి హరీశ్ రావు

రైతు బాగుపడాలంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గద్దె దిగాల్సిందేనని మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో వడ్లు కొనకుండా బీజేపీ రాజకీయ కుట్రలు చేస్తోందని, రైతులను దగా చేస్తోందని అన్నారు. వడ్లు కొంటారా లేదా అని ప్రతి గ్రామంలో బీజేపీ నేతలను నిలదీయాలని చెప్పారు. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదని, సీఎం కేసీఆర్ రైతుల కోసం చేయాల్సింది అంతా చేశారనన్నారు. దేశంలో మూడు ప్రభుత్వాలు ఉంటాయని, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వమన్నారు. రెండు సమర్ధవంతంగా పనిచేస్తుంటే పంట కొనాల్సిన కేంద్రం చేతులెత్తేస్తోందని విమర్శించారు. పంటలు పండిన చోట ధాన్యాన్ని కొని, పండని చోట, అలాగే ప్రకృతి విలయాలు ఏర్పిడన చోట ప్రజలకు అవసరమైన ధాన్యాన్ని అందుబాటులో ఉంచడం కేంద్ర ప్రభుత్వ విధి పేర్కొన్నారు. పంటలు పండించడం రాష్ట్రం బాధ్యతని, దాన్ని కొనే బాధ్యత కేంద్రానిది చెప్పారు. ఈ విషయంలో చివరి వరకు పోరాడామని, రైతుల బతుకు బాగుపడాలంటే బీజేపీని దించాల్సిందేని మంత్రి హరీశ్ రావు అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 13 =