సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌కి జీహెచ్‌ఎంసీ చెక్.. హైదరాబాద్ ఐడీపీఎల్‌లో తొలి ఎనీ టైమ్‌ బ్యాగ్‌ మిషన్ ఏర్పాటు

GHMC Installed Solar Powered Cloth Bag ATM Near IDPL Fruit Market at Kukatpally Hyderabad,GHMC Installed Solar Powered Cloth Bag ATM,IDPL Fruit Market at Kukatpally,GHMC at Kukatpally Hyderabad,Solar Powered Cloth Bag ATM,Mango News,Mango News Telugu,Solar-powered Cloth bag ATM installed,Cloth Bag ATM installed at Kukatpally,KTR on Twitter,Any Time Bag,GHMC Latest News and Updates,Solar Powered Cloth Bag Latest News,Solar Powered Cloth Bag News Today,Telangana Latest News And Updates,Hyderabad News,Telangana News,Telangana News Today

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ సమస్యకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) చెక్‌ పెట్టింది. దీనిలో భాగంగా.. కూకట్‌పల్లిలోని ఐడీపీఎల్‌ ఫ్రూట్‌ మార్కెట్‌ సమీపంలో సౌరశక్తితో నడిచే క్లాత్‌ బ్యాగ్‌ల కోసం ఏటీఎం లాంటి యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ మెషిన్‌లో ఒక పది రూపాయల నోటు లేదా కాయిన్‌ను వేయగానే వస్త్రంతో తయారు చేసిన ఒక క్యారీ బ్యాగ్‌ బయటికి వస్తుంది. సుమారు 5 కేజీల వరకు బరువును భరించగల సామర్థ్యం ఉండేలా ఈ క్యారీ బ్యాగులను డిజైన్‌ చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయంగా, స్వయం సహాయక మహిళా సంఘాల సహకారంతో ముడిపడి ఉన్న ఈ యంత్రాలు పర్యావరణ కాలుష్య భారాన్ని తగ్గించడంలో ‘రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్’ విధానానికి అనుగుణంగా నిలిచే బ్యాగ్‌లను అందిస్తాయని జీహెచ్‌ఎంసీ అధికారులు పేర్కొన్నారు.

‘క్లాత్ బ్యాగ్ ఏటీఎం’ అనే ఈ వెండింగ్‌ మిషన్‌ హైదరాబాద్‌ను ప్లాస్టిక్ రహితంగా మార్చడంతో పాటు బయోడిగ్రేడబుల్ క్లాత్‌తో తయారు చేసిన బ్యాగులను వినియోగదారులకు తక్కువ ఖర్చుకే అందిస్తోందని వారు తెలిపారు. కాగా ఈ ఏటీబీ మిషన్‌లను త్వరలో రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఈ ఎనీ టైమ్‌ బ్యాగ్‌ మిషన్‌ ప్రాజెక్టును ఆవిష్కరించిన మొవేట్ మరియు యునైటెడ్‌ వే ఆఫ్‌ హైదరాబాద్‌ సంస్థల ప్రయత్నాన్ని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. మరోవైపు ఐడీపీఎల్‌లో ఎనీ టైమ్‌ బ్యాగ్‌ మిషన్‌ ఏర్పాటు చేసిన విషయాన్ని కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ మమత ట్విటర్‌ ద్వారా వెల్లడించగా.. నెటిజన్‌లు ఈ నూతన ఆవిష్కరణ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 11 =