దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు.. 24 గంటల్లో కొత్తగా 6155 మందికి కోవిడ్-19

India Reports 6155 Fresh Covid-19 Cases in Last 24 Hours Active Cases Raised To 31194,India Reports 6155 Fresh Covid-19 Cases,Covid-19 Cases in Last 24 Hours,India Active Cases Raised To 31194,Mango News,Mango News Telugu,Amid Covid-19 Surge,Amid Rising Covid-19 Cases,Covid-19 Latest News,Covid-19 Latest Updates,Health Minister Likely To Chair Review,Minister Mansukh Mandaviya Latest News,Union health minister chairs Covid review meet,Union Health Minister Mansukh Mandaviya,Union Health Minister Mansukh Mandaviya Chairs Review Meeting With State and UT’s Health Ministers Amid Covid-19 Surge

గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి పెరిగిపోతోంది. ముఖ్యంగా కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఎక్స్‌బీబీ 1.16 రకం వైరస్‌ బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం 6050 కేసులు నమోదవగా, గడచిన 24 గంటల్లో కొత్తగా మరో 6155 కేసులు వెలుగుచూశాయి. దీంతో పాజిటివిటీ రేటు 5 శాతం దాటింది. కాగా ఇంత భారీగా కేసులు నమోదవడం గత 7 నెలల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. అలాగే మరో 11 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల ఆరోగ్యశాఖల మంత్రులతో సమావేశం నిర్వహించి, రాష్ట్రాలకు పలు కీలక సూచనలు చేసింది. దీనిలో భాగంగా ఎమెర్జెన్సీ హాట్ స్పాట్స్ గుర్తించి కోవిడ్ వ్యాప్తి కట్టడికి చర్యలు తీసుకోవాలని మాండవీయ సూచించారు. ఇక మరోవైపు పుదుచ్చేరిలో కరోనా వ్యాప్తి నివారణ కోసం మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేశారు.

దేశంలో కరోనా కేసులు వివరాలు (2023, ఏప్రిల్ 08, ఉదయం 8 గంటల వరకు):

  • ఏప్రిల్ 7న నిర్వహించిన కరోనా పరీక్షలు : 1,60,742
  • కొత్తగా నమోదైన కేసులు [ఏప్రిల్ 07–ఏప్రిల్ 08 (8AM-8AM)] : 6,155
  • మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,47,51,259
  • కొత్తగా కోలుకున్నవారి సంఖ్య : 3,253
  • రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,41,89,111
  • కరోనా రికవరీ రేటు : 98.74 శాతం
  • యాక్టీవ్ కేసులు : 31,194
  • కొత్తగా నమోదైన మరణాలు : 11
  • మొత్తం మరణాల సంఖ్య : 5,30,954
  • మొత్తం కరోనా వ్యాక్సిన్‌ డోసులు: 220.66 కోట్లు పంపిణీ

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =