తెలంగాణలో రేపే సీఎంఎస్‌టీఈ యూనిట్ల పంపిణీ.. మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేత

Minister KTR To Distribute Special Units For Beneficiaries Under CMSTE Scheme Tomorrow,Minister KTR To Distribute Special Units,Special Units For Beneficiaries,Beneficiaries Under CMSTE Scheme Tomorrow,CMSTE Scheme,Mango News,Mango News Telugu,Minister KTR,Minister KTR Latest News and Updates,CM KTR News And Live Updates,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,CMSTE Scheme Latest News,CMSTE Scheme Latest Updates

తెలంగాణలో అట్టడుగు వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రోత్సాహక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక పథకం (సీఎంఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌) లబ్ధిదారులకు రేపు యూనిట్లను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతుల మీదుగా లబ్ధిదారులకు యూనిట్లను అందించనున్నట్లు గిరిజన సంక్షేమశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గిరిజన సంక్షేమశాఖ ట్రైకార్‌ ద్వారా అమలు చేస్తున్న సీఎంఎస్‌టీఈ, ఎంఎస్‌ఎంఈ, ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌, రూరల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ ప్లాన్‌లో భాగంగా ఎంపికైన లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేస్తున్నామని ట్రైకార్‌ చైర్మన్‌ ఇస్లావత్‌ రామచందర్‌ నాయక్‌ తెలిపారు.

ఈ క్రమంలో సోమవారం హైదరాబాద్‌ నగరంలోని బంజారాహిల్స్‌లో ఇటీవల నూతనంగా నిర్మించిన సేవాలాల్‌ బంజారా భవన్‌లో జరిగే ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చైర్మన్‌ నాయక్‌ వెల్లడించారు. కాగా ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌, హోంమంత్రి మహమూద్‌ అలీ సహా ఇతర మంత్రులు సత్యవతి రాథోడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చొంగ్తూ తదితరులు పాల్గొంటారని రామచందర్‌ నాయక్‌ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + three =