పోటీ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలి: మంత్రి కేటీఆర్

Allow candidates to write job exams in regional languages, Allow regional languages’ use in competitive exams, Competitive Exams in Regional languages, KTR pitches for competitive exams, KTR Writes a letter to Centre to Conduct Competitive Exams, KTR Writes a letter to Centre to Conduct Competitive Exams in Regional languages, KTR writes to Union Minister for conducting recruitment tests, Mango News, Minister KTR requests Centre to allow candidates, Minister KTR Writes a letter to Centre to Conduct Competitive Exams, Minister KTR Writes a letter to Centre to Conduct Competitive Exams in Regional languages, telangana

కేంద్రం నిర్వహించే అన్ని పోటీ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని కేంద్ర సహాయమంత్రి జితేందర్‌సింగ్‌ కు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. జాతీయస్థాయి పోటీ పరీక్షలను కేవలం హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే నిర్వహిస్తున్నారని, ఈ విధానం వలన ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో చదువుకోని అభ్యర్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల అభ్యర్థులు నష్టపోతున్నారని అన్నారు. అన్నిరకాల పోటీ పరీక్షలను తెలుగు సహా 12 ప్రాంతీయభాషల్లో నిర్వహించాలంటూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని అమలుచేయాలని కోరారు. అన్ని ప్రాంతీయభాషల్లో పరీక్ష రాసే అవకాశం కల్పించడంపై నిర్ణయం తీసుకునేవరకు, ఇప్పటికే ప్రకటించిన నోటిఫికేషన్ల నియామక ప్రక్రియను నిలిపివేయాలని కేంద్ర మంత్రికి మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

మరోవైపు యూపీఎస్సి, ఆర్ఆర్బి, నేషనలైజ్డ్ బ్యాంక్స్, ఆర్బీఐ, ఎస్ఎస్సి, డిఫెన్స్ సహా వివిధ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలను ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించేలా చూడాలని కోరుతూ, భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ లకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గతంలోనే వేర్వేరుగా లేఖలు రాశారు. ఈ పోటీ పరీక్షలను ప్రస్తుతం ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో మాత్రమే నిర్వహించడం వలన హిందీయేతర భాషలు మాట్లాడే రాష్ట్రాల నుండి మరియు ఇంగ్లీష్ మీడియం నేపధ్యం లేని విద్యార్థులు తీవ్రమైన ప్రతికూలతను ఎదుర్కుంటున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు సమానమైన అవకాశాలు ఇచ్చే విధంగా ప్రాంతీయభాషల్లో కూడా పరీక్షలు నిర్వహించాలని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. తాజాగా మరోమారు మంత్రి కేటీఆర్ కూడా ఈ అంశంపై కేంద్రానికి లేఖ రాశారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 9 =