సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ, సంక్రాంతి వేడుకల్లో మంత్రి తలసాని

Minister Talasani Srinivas Yadav Participated in Sankranthi Celebrations at People's Plaza in Hyderabad,Under The Leadership Of Cm Kcr,Minister Talasani In Telangana,Sankranthi Celebrations As Annapurna,Who Gives Rice To The Country,Mango News,Mango News Telugu,Kanti Velugu Programme Latest News And Updates,Kanti Velugu News And Live Updates,Cm Kcr News And Live Updates, Telangna Congress Party, Telangna Bjp Party, Ysrtp,Trs Party, Brs Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana Minister Ktr

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా అభివృద్ధి సాధించిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం పీవీ మార్గ్ లోని పీపుల్స్ ప్లాజాలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, సంక్రాంతి పాటలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. హరిదాసులకు మంత్రి సంక్రాంతి కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారులకు పతంగులను పంపిణీ చేసిన అనంతరం మంత్రి పతంగులను ఎగుర వేశారు.

అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, మన సంస్కృతి, సాంప్రదాయాలు చాలా గొప్పవని, దేశ, విదేశాలలో మన సాంప్రదాయాలు, ఆచారాలను ఎంతో గౌరవిస్తారని చెప్పారు. సంక్రాంతి పండుగ తెలుగు వారు ఎంతో గొప్పగా జరుపుకుంటారని అన్నారు. యువతులు, మహిళలు రంగురంగుల ముగ్గులతో ఇంటి ముంగిళ్ళను ఎంతో అందంగా అలంకరిస్తారని వివరించారు. పండుగలు మన సంస్కృతిని చాటి చెప్పుతాయని పేర్కొన్నారు. మన పిల్లలకు పండుగ ప్రత్యేకతలు, సాంప్రదాయాలను తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులపై ఉందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రం సస్యశ్యామలంగా మారి పంటలు విస్తారంగా పండుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, నగర గ్రంధాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here