మునుగోడు ఉపఎన్నిక: నాది హోంగార్డు స్థాయి, ఎస్పీ స్థాయి వాళ్లే ప్రచారానికి వెళ్లాలి – కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Munugode By-poll Congress MP Komatireddy Venkat Reddy Interesting Comments on Election Campaining, Munugode By-poll Congress, Congress MP Komatireddy Venkat Reddy, Komatireddy Venkat Reddy Interesting Comments, Munugode Election Campaining, Mango News,Mango News Telugu, Munugode Bypoll, CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP , Munugode By Polls, Munugode Election Schedule Release, Munugode Election, Munugode Election Latest News And Updates, Munugode By-poll, BRS Party, Prajashanti Party

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో అన్ని పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. తమ పార్టీ అభ్యర్థికే ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ క్రమంలో టీకాంగ్రెస్ కూడా నియోజకవర్గంలో ఉధృతంగా ప్రచారం చేస్తోంది. అయితే పైకి అంతా బానే ఉన్నట్లు కనిపిస్తున్నా, అంతర్గత కలహాలు ఆ పార్టీని కలవర పెడుతున్నాయి. తాజాగా భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దీనికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకు గాంధీభవన్ కు వచ్చిన ఎంపీ కోమటిరెడ్డి ఓటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు ప్రచారానికి తాను వెళ్ళేది లేదని స్పష్టం చేశారు. తనది హోంగార్డు స్థాయి అని, ఎస్పీ స్థాయి వాళ్లే మునుగోడు ప్రచారానికి వెళ్లాలని పరోక్షంగా టీపీసీసీ సారధి రేవంత్ రెడ్డికి చురకలంటించారు. గతంలో కోమటిరెడ్డికి ఉద్దేశించి రేవంత్ హోంగార్డు అని వ్యాఖ్యానించినట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎంపీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అలాగే గతంలో తనపై వంద కేసులు పెట్టినా సరే ఒంటరిగా సర్కార్‌ను తీసుకొస్తానని ఒక నేత చెప్పాడని, ఇప్పుడు కూడా మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆయనే గెలిపిస్తాడని అన్నారు. దీంతో ఇన్ని రోజులూ.. సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా వెంకట్ రెడ్డి ప్రచారణకి వెళ్తారా? లేదా? అని ఎదురు చూస్తున్నవారికి ఎంపీ వ్యాఖ్యలు స్పష్టతనిచ్చాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 6 =