అక్టోబర్ 19న బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

Former TRS MP Boora Narsaiah Goud To Join in BJP On October 19th, Former TRS Leader Narsaiah Goud To Join BJP, TRS Leader Narsaiah Goud Joining BJP, Narsaiah Goud Joining BJP Confirms Bandi Sanjay Kumar, Mango News,Mango News Telugu, Former TRS Leader Narsaiah Goud, Telangana Chief Bandi Sanjay Kumar, Telangna BJP Party, YSRTP , Munugode By Polls, Munugode Election Schedule Release, Munugode Election, Munugode Election Latest News And Updates, Munugode By-poll, BRS Party, Prajashanti Party

టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఇటీవలే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు లేఖ పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణలో భాగంగా బూర నర్సయ్య గౌడ్ భారతీయ జనతా పార్టీలో (బీజేపీ) చేరాలని నిర్ణయించుకున్నారు. సోమవారం బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్, బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సభ్యుడు, రాజ్యసభ ఎంపీ కె.లక్ష్మణ్ సహా పలువురు నేతలతో బూర నర్సయ్య గౌడ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారు ఆయన్ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అలాగే అక్టోబర్ 19, బుధవారం నాడు తాను బీజేపీలో అధికారికంగా చేరబోతున్నట్లు బూర నర్సయ్య గౌడ్ ప్రకటించారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పలువురు కేంద్రమంత్రులు, బండి సంజయ్ సమక్షంలో బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 3 =