సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi Flags off Secunderabad-Tirupati Vande Bharat Express Train From Secunderabad Railway Station,PM Modi Flags off Secunderabad-Tirupati Vande Bharat Express,PM Modi Flags off Vande Bharat Express,Vande Bharat Express Train,Secunderabad Railway Station,PM Modi From Secunderabad Railway Station,Mango News,Mango News Telugu,PM In Hyderabad Today,Narendra Modi News Live,PM Modi Visit Hyderabad Today,PM Modi To Inaugurate Vande Bharat Express,PM Modi In Chennai And Hyderabad Today,PM Modi To Launch 12th Vande Bharat Express,PM Modi Vande Bharat Express News,Telangana Vande Bharat Express Latest Updates,Telangana Vande Bharat Express News Today,Vande Bharat Flag Off In Modi’S Chennai Tour

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం తెలంగాణ పర్యటనకు విచ్చేశారు. పర్యటనలో భాగంగా ఆయన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు బేగంపేట విమానశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు ఘనస్వాగతం పలికారు. ఇక ప్రధాని పర్యటన సందర్భంగా అధికారులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. అయితే ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. ఇక రాష్ట్ర పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ దాదాపు 11,300 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో పరేడ్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 12 =