ఎట్టి పరిస్థితుల్లో సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు – రామగుండం బహిరంగ సభలో ప్రధాని మోదీ

PM Modi Gives Clarity on Privatisation of Singareni Coal Blocks in Public Meeting at Ramagundam Today, PM Modi At Ramagundam Public Meeting, Privatisation of Singareni Coal Blocks, Ramagundam Public Meeting, Singareni Coal Blocks, PM Modi Gives Clarity, PM Modi Telangana Tour, PM Modi at Telangana, PM Modi Telangana Visit, PM Modi in Telangana, Prime Minister Narendra Modi, Narendra Modi, Coal miners protest, PM Narendra Modi in Telangana, PM Modi Telangana Tour News, PM Modi Telangana Tour Latest News And Updates, PM Modi Telangana Tour Live Updates, Mango News, Mango News Telugu

తెలంగాణ రాష్ట్రంలోని ప్రఖ్యాత సింగరేణి గనుల్లో కొన్ని బ్లాకులను కేంద్రం ప్రైవేట్ పరం చేయనుందని గత కొంత కాలంగా వినిపిస్తున్న ఊహాగానాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టతనిచ్చారు. ఈ మేరకు ఆయన శనివారం రామగుండంలో జరిగిన బహిరంగ సభలో ఒక కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లో సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని, కావాలనే కొందరు దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా దీనికి సంబంధించి కేంద్రం వద్ద ఎలాంటి ప్రయివేటీకరణ ప్రతిపాదన లేదని, సింగరేణి ఈ దేశ సంపద అని పేర్కొన్నారు. ఇక సింగరేణిలో తెలంగాణకు 51 శాతం వాటా ఉంటే, కేంద్రం వాటా 49 శాతం అని తెలిపిన ప్రధానమంత్రి..  ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా రాష్ట్ర ప్రభుత్వానికే అధికారం ఉంటుందని స్పష్టం చేశారు. ఈరోజు రామగుండంలో దాదాపు రూ. 10వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించామని, తెలంగాణ పురోగతిలో ఇవి కీలక భూమిక పోషించనున్నాయని ప్రధాని మోదీ తెలిపారు.

ఇక ఈ సభలో ప్రధానమంత్రితో పాటుగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుభా, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మరియు అధికారులు హాజరయ్యారు. ఈ బహిరంగ సభకు రైతులు, ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. దీనికి ముందు ప్రధాని మోదీ రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌) ను సందర్శించారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ లో కలియ తిరుగుతూ ఆయన ఎరువుల ఉత్పత్తిని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్లాంట్ పనితీరు, ఉత్పత్తి సహా ఇతర సంబంధిత వివరాలను సంస్థ అధికారులు ప్రధాని మోదీకి వివరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × five =