తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు సంస్థలు భారీ పెట్టుబడులు

Granules and Laurus Labs Pharma companies, Granules India, Granules India and Laurus Labs, Hyderabad attracts Rs 700 crore investments in pharma, Laurus Labs, Major Investments in Genome Valley in Hyderabad, Pharma companies announce plans to invest, Pharma firms Granules and Laurus Labs, pharmaceutical industry

తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబ‌డులు పెట్టేందుకు మరో రెండు సంస్థలు ముందుకొచ్చాయి. లారస్‌ ల్యాబ్స్‌, గ్రాన్యూల్స్‌ ఇండియా కంపెనీలు రాష్ట్రంలో రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. ఆ కంపెనీల ప్రతినిధులు ప్ర‌గ‌తి భ‌వ‌న్ ‌లో రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటిఆర్‌ ను కలుసుకుని  వివరాలును తెలియజేశారు. నగరంలోని జినోమ్ వ్యాలీలో గ్రాన్యూల్స్ ఇండియా రూ.400 కోట్లు, లార‌స్ ల్యాబ్స్ రూ.300 కోట్లు పెట్టుబ‌డులు పెట్ట‌నున్నాయి. ఈ కంపెనీల పెట్టుబ‌డుల ద్వారా 1300 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి ల‌భించే అవ‌కాశం ఉందని మంత్రి కేటిఆర్ తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నదుకు ఆ కంపెనీల‌కు మంత్రి కేటిఆర్ ధ‌న్య‌వాదాలు తెలుపుతూ, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో స‌హ‌కారం అందిస్తుంద‌ని హామీ ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =