నేటి నుంచి రెస్టారెంట్స్ ఓపెన్, యాజమాన్యాలు పాటించాల్సిన రూల్స్ ఇవే…

India Lockdown Relaxations, india lockdown updates, MHFW Released SOP on Preventive Measures, Shopping Malls, Shopping Malls open, Telangana Lockdown, Telangana Lockdown Relaxations, telangana lockdown rules, telangana lockdown updates, Telangana Malls, Telangana Malls Open Today With COVID-19 Guidelines

దేశంలో కంటైన్మెంట్ జోన్లలో జూన్‌ 30 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ ఇటీవలే కేంద్రప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే కంటైన్మెంట్ జోన్స్ కానీ ప్రాంతాల్లో ఇప్పటివరకు నిషేదించిన పలు కార్యకలాపాలను దశలవారీగా(ఫేజ్-1, ఫేజ్-2, ఫేజ్-3) తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించారు. ఫేజ్-1 జూన్ 8 నుంచి మొదలవుతుండగా, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

ఈరోజు (జూన్ 8, సోమవారం) నుంచి ఇప్పటివరకు నిషేధించిన కొన్ని కార్యకలాపాలు రాష్ట్రంలో కూడా తిరిగి ప్రారంభం అయ్యాయి. అందులో భాగంగా దేవాలయాలు సహా ఇతర ప్రార్థనా మందిరాలు హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్స్ ఈ రోజు నుంచి తెరుచుకున్నాయి. అయితే కంటైన్మెంట్ జోన్లలో ఎలాంటి మినహాయింపు ఉండవని పేర్కొన్నారు.

రెస్టారెంట్స్ యాజమాన్యాలు పాటించాల్సిన నియమాలు ఇవే:

  • రెస్టారెంట్స్ టేక్అవే ను ప్రోత్సహించాలి. హోమ్ డెలివరీ సిబ్బందిని ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్లేముందు థర్మల్ స్క్రీనింగ్ ద్వారా పరీక్షించాలి. అలాగే ఫుడ్ పార్సెల్స్ ను కస్టమర్లకు నేరుగా చేతికి అందించకుండా, వాటి ఇంటి డోర్ వద్ద ఉంచేలా సూచనలు ఇవ్వాలి.
  • రెస్టారెంట్స్ లో 50 % సీటింగ్ సామర్థ్యం కంటే ఎక్కువ అనుమతించబడదు. వారికీ కూడా తగినంత భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేయాలి.
  • భౌతిక దూరాన్ని అమలు చేసే విధంగా తగినంత సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలి.
  • డిస్పోజబుల్ మెనూలు వాడడం మంచిది.
  • క్లాత్ న్యాప్‌కిన్‌లకు బదులుగా డిస్పోజబుల్ పేపర్ న్యాప్‌కిన్‌లను వాడాలి.
  • భౌతిక దూరాన్ని పాటిస్తూ బఫేట్ సేవలను కొనసాగించాలి
  • కాంటాక్ట్‌లెస్ మోడ్ ఆఫ్ ఆర్డరింగ్/డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలి.
  • వెయిటర్లు మరియు ఇతర సిబ్బంది మాస్కులు, గ్లోవ్స్ తప్పనిసరిగా ధరించాలి.
  • కస్టమర్ వెళ్లిన ప్రతిసారీ సంబంధిత ఫర్నిచర్ ను శానిటైజ్ చేయాలి.
  • వంటగది సిబ్బంది భౌతిక దూరాన్ని పాటించాలి, అలాగే వంటశాలలు తరచూ శుభ్రపరుస్తూ ఉండాలి.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + twenty =