తొలిరోజు 16.95 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.516.95 కోట్ల రైతుబంధు నిధులు జమ

Funds for Rythu Bandhu Scheme, Mango News, Rs 516.95 Cr Deposited in Accounts of 16.95 Lakh Farmers on First Day, Rythu Bandhu, Rythu Bandhu Cheques, Rythu Bandhu Distribution, Rythu Bandhu Funds Distribution, Rythu Bandhu Latest News, Rythu Bandhu Scheme, Rythu Bandhu Scheme in Telangana, Rythu Bandhu Scheme Money, Rythu Bandhu Telangana, telangana agriculture minister, Telangana Agriculture Minister Niranjan Reddy, Telangana Rythu Bandhu, TRS Government

తెలంగాణ రాష్ట్రంలో రైతులకు జూన్ 15  నుంచి రైతుబంధు నగదు పంపిణీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలిరోజు జరిగిన రైతుబంధు పంపిణీ వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలియజేశారు. తొలిరోజున 16.95 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.516.95 కోట్ల రైతుబంధు నిధులు జమ చేసినట్టు మంత్రి వెల్లడించారు. నల్గొండ జిల్లాలో అత్యధికం 1,11,970 రైతుల ఖాతాల్లోకి రూ.36.10 కోట్లు జమ అయ్యాయని, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా 9628 మంది రైతుల ఖాతాల్లోకి రూ.35.60 లక్షలు జమచేసినట్టు పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎకరా వరకు ఉన్న 10 లక్షల 33 వేల 915 ఎకరాలకు చెందిన 16 లక్షల 95 వేల 601 మంది రైతుల ఖాతాలకు రైతుబంధు నిధులు జమచేయడం జరిగిందన్నారు. ఇక రెండవ రోజున రెండు ఎకరాల వరకు ఉన్న 23.05 లక్షల ఎకరాలకు గాను 15.07 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.1152.46 కోట్లు జమ చేయనున్నట్టు చెప్పారు. రెండవ రోజూ కూడా నల్గొండ జిల్లాలోనే అత్యధికం లక్షా 10 వేల 407 మంది రైతుల ఖాతాలకు రూ.85.23 కోట్లు జమవుతాయన్నారు. రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలో జమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు, వ్యవసాయ శాఖ సిబ్బందికి, ఆర్థిక శాఖ సిబ్బందికి మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అలాగే తెలంగాణ రైతాంగానికి అభినందనలు తెలియజేశారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =