తెలంగాణలో 18 ఏళ్లు పైబడినవారికి కరోనా వ్యాక్సిన్, ప్రైవేట్ ఆసుపత్రులకు అనుమతి

Covid vaccine for all above 18 yrs, COVID-19 Vaccination, Covid-19 vaccination for 18+ begins, COVID-19 vaccination for people in 18-44 age, COVID-19 vaccination for people in 18-44 age group, CoWIN app registration, Mango News, Telangana Government, Telangana Government Approves Vaccination For People Above 18 Years In Private Hospital, Telangana permits private hospitals to vaccinate people in 18-44 age, Vaccination For People Above 18 Years In Private Hospital

కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు పైబడినవారికి కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు ప్రైవేటు ఆస్ప‌త్రుల‌కు అనుమతిస్తున్నట్టు మంగళవారం నాడు ప్ర‌భుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జీ.శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీచేశారు. “గుర్తింపు పొందిన ప్రైవేట్ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్స్ (పీవీసీసీ) ను మ్యాపింగ్ చేస్తూ 18 ఏళ్లు పైబడినవారికి మరియు వర్క్ ప్లేస్ లలో కరోనా వ్యాక్సిన్ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు కోవిడ్ వ్యాక్సినేష‌న్ సెంటర్స్ గా గుర్తింపు పొందిన ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా కరోనా వ్యాక్సినేషన్ నిర్వహించేందుకు అనుమతి ఇస్తున్నాం. అలాగే వర్క్ ప్లేసులలో (సంస్థలు/కంపెనీలు/గేటెడ్ కమ్యూనిటీలు) కూడా వ్యాక్సినేషన్ నిర్వహించవచ్చు. అయితే వ్యక్తులు కోవిన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి, పీవీసీసీలు కోవిడ్ వ్యాక్సినేషన్ మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 16 =