కేడర్ స్ట్రెంత్ కేటాయింపుపై ఉద్యోగ సంఘాలతో సీఎస్ సోమేశ్ కుమార్ సమావేశం

CS meets Telangana Gazetted, CS meets Telangana Gazetted Non-Gazetted Officers, CS Somesh Kumar, CS Somesh Kumar Met with Employees Unions on Allocation of Cadre Strength, CS Somesh Kumar Met with Employees Unions on Allocation of Cadre Strength as per Presidential Orders, IPRDepartment, Mango News, Somesh Kumar Met with Employees Unions, Somesh Kumar Met with Employees Unions on Allocation of Cadre Strength, Telangana Chief Secretary, Telangana Chief Secretary Somesh Kumar

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం బి.ఆర్.కె.ఆర్ భవన్‌లో తెలంగాణ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల ఎంప్లాయీస్ యూనియన్స్ మరియు అధికారులతో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కేడర్ స్ట్రెంత్ కేటాయింపుపై సమావేశం నిర్వహించారు. జిల్లా, జోనల్ మరియు మల్టీ జోనల్ కేడర్ లకు సిబ్బంది కేటాయింపును విజయవంతంగా పూర్తి చేయడానికి సహకారం అందించడంతో పాటు సలహాలు సూచనలు, అభిప్రాయాలను తెలుపాలని వారిని సీఎస్ కోరారు.

పిఆర్‌సి అమలు, ఉద్యోగులతో స్నేహపూర్వక విధానాలను పాటిస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ఉద్యోగ సంఘాలు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాయి. ఉద్యోగుల సంఘాలు వివిధ కేడర్ లకు అధికారుల కేటాయింపు గురించి తమ అభిప్రాయాలను తెలియజేసాయి. ఇతర సహచరులు మరియు యూనిట్‌లను సంప్రదించిన తర్వాత ఆగస్టు 12న తగు సూచనలతో తిరిగి సీఎస్ తో సమావేశం కానున్నట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ఈ సమావేశంలో జి.ఎ.డి. ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, జి.ఎ.డి ఓఎస్డీ అప్పారావు, హెఛ్ఆర్ఎం అండ్ ఎస్ఆర్ఎం సీనియర్ కన్సల్టెంట్ శివ శంకర్, ఆర్ధిక శాఖ అదనపు కార్యదర్శి రవి, హోం శాఖ ఎస్ఓ వనజ, ఓఎస్డీ టూ సీఎం సెక్రటెరీ కృష్ణ మూర్తి, టీజీవోల అసోసియేషన్ ప్రెసిడెంట్ మమత మరియు టీఎన్జీవో అసోసియేషన్ ప్రెసిడెంట్ మామిళ్ల రాజేందర్ హాజరయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + nineteen =