మాజీ మంత్రి నారాయణను విచారించనున్న ఏపీ సీఐడీ.. షరతులతో అనుమతిచ్చిన హైకోర్టు

AP High Court Gives Permission For CID To Interrogate Ex- Minister Narayana in Amaravati Inner Ring Road Alignment Case,AP High Court Permission For CID,CID To Interrogate Narayana,Ex- Minister Narayana,Mango News,Mango News Telugu,CID Ex- Minister Narayana,Former Minister Narayana,Narayana Educational Institutions,Narayana Institution Founder,Narayana Institution Founder Narayana,AP High Court,AP CID Latest News And Updates

టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణను విచారించుకోవడానికి ఏపీ హైకోర్టు సీఐడీ అధికారులకు అనుమతి ఇచ్చింది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌‌రోడ్డు అలైన్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయని నారాయణపై ఆరోపణలు రావడంతో దీనికి సంబంధించి ఏపీ సీఐడీ పోలీసులు 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. అయితే సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసులను నారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై బుధవారం విచారణ జరుగగా.. నారాయణకు 65 సంవత్సరాలని, ఇటీవలే శస్త్ర చికిత్స చేయించుకున్నారని ఆయన తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో నారాయణకు చెందిన హైదరాబాద్ లేదా కూకట్‌పల్లిలోని నివాసంలో మాత్రమే ఆయనను ప్రశ్నించాలని ఏపీ సీఐడీ అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. అలాగే నారాయణ తరపు న్యాయవాది సమక్షంలో విచారించాలని కూడా స్పష్టం చేసింది. ఇక నారాయణ కూడా సీఐడీకి సహకరించాలని హైకోర్టు సూచించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 2 =