తెలంగాణలో మేయర్లు, మున్సిపల్‌ ఛైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు

Mango News Telugu, Political Updates 2020, Reservations For Mayors, telangana, Telangana Breaking News, Telangana Municipal Elections, Telangana Municipal Elections 2020, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2020

జనవరి 22న జరగనున్న తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కార్పోరేషన్ మేయర్లు, మున్సిపల్‌ ఛైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. ఈ రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలను పురపాలక శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ టీకే శ్రీదేవి జనవరి 5, ఆదివారం నాడు మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీ చైర్‌పర్సన్లు, 13 మున్సిపల్‌ కార్పోరేషన్ మేయర్‌ స్థానాలకు రిజర్వేషన్లు ప్రకటించారు. 13 కార్పోరేషన్లలో ఎస్సీలకు 1, ఎస్టీలకు 1, బీసీలకు 4, జనరల్‌కు 7 స్థానాలు కేటాయించారు. అలాగే 123 మున్సిపల్‌ ఛైర్ పర్సన్ స్థానాల్లో ఎస్టీలకు 4, ఎస్సీలకు 17, బీసీలకు 40, జనరల్‌కు 62 స్థానాలు కేటాయించారు. బీసీలకు 29.40 శాతం, ఎస్టీలకు 5.83, ఎస్సీలకు 14.15 శాతం రిజర్వేషన్లు దక్కాయి. జనవరి 7న ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడుతుండగా, 22న ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే 24న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలును ప్రకటించనున్నారు.

మున్సిపల్‌ కార్పోరేషన్ మేయర్‌ రిజర్వేషన్లు:

  • ఓసీ (మహిళ): జీహెచ్‌ఎంసీ, ఖమ్మం, నిజాంపేట్, బడంగ్‌పేట్
  • బీసీ (మహిళ): నిజామాబాద్‌, జవహర్‌నగర్
  • ఓసీ (జనరల్‌): బోడుప్పల్, పీర్జాదిగూడ, కరీంనగర్
  • బీసీ (జనరల్‌): వరంగల్‌, బండ్లగూడ జాగీర్
  • ఎస్సీ (జనరల్‌): రామగుండం
  • ఎస్టీ (జనరల్‌): మీర్‌పేట

మున్సిపల్‌ ఛైర్ పర్సన్ రిజర్వేషన్లు:

  • బీసీ (జనరల్‌)- 20 స్థానాలు 
  • బీసీ (మహిళ) – 20 స్థానాలు
  • ఎస్సీ (జనరల్‌) – 9 స్థానాలు
  • ఎస్సీ (మహిళ) – 8 స్థానాలు
  • ఎస్టీ (జనరల్‌) – 2 స్థానాలు
  • ఎస్టీ (మహిళ) – 2 స్థానాలు
  • ఓసీ (జనరల్‌) – 31 స్థానాలు
  • ఓసీ (మహిళ) – 31 స్థానాలు

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − three =