వీఆర్ఏల సమస్యలకు త్వరలోనే ప‌రిష్కారం, సమ్మెను విరమించి విధుల్లో చేరండి – మంత్రి కేటీఆర్

Minister KTR Meets VRAs in Begumpet Metro Bhawan Assures To Resolve Their Issues, Minister KTR Meets VRAs in Begumpet Metro Bhawan,KTR Holds Talks with VRAs, Minister KTR Meet VRAs, VRAs Meeting Completed With Minister KTR, Pay Scales To VRAs Increased, Mango News, Mango News Telugu, VRA Salary Issue, KTR Meets VRAs , KTR Meets VRAs in Assembly, Minister KTR Meets VRAs, Minister KTR Meets VRAs in Assembly , Minister KTR, Minister KTR Latest News And Updates, KTR , Telangna VRA Issues

తెలంగాణ వ్యాప్తంగా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గ‌త కొద్ది రోజులుగా నిరసనలు తెలుపుతున్న వీఆర్ఏ ప్రతినిధులతో రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ల మంత్రి కేటీ రామారావు స‌మావేశ‌మ‌య్యారు. ఈ మేరకు ఆయన మంగళవారం హైదరాబాద్ లోని బేగంపేట మెట్రోభవన్​లో వీఆర్ఏల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సహా సంబంధిత శాఖ అధికారులు హాజరయ్యారు. వారితో చర్చల సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వీఆర్ఏలకు ఇచ్చిన హామీల అమలుకు చిత్తశుద్ధితో ఉన్నారని, త్వరలోనే వారి సమస్యలను సాల్వ్ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వం వేరు.. వీఆర్ఏలు వేరు కాదని, ఈ విషయంలో ప్రభుత్వంపై వీఆర్ఏలు నమ్మకం ఉంచాలని కోరారు. తన మాటలపై భరోసా ఉంచి వెంటనే తమ ఆందోళన విరమించి తిరిగి విధుల్లో చేరాలని వీఆర్ఏలకు మంత్రి పిలుపునిచ్చారు.

మంత్రి కేటీఆర్ హామీపై స్పందించిన వీఆర్ఏ ప్రతినిధులు, తమకు ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ పై నమ్మకం ఉందని స్పష్టం చేశారు. క్రితంసారి కలిసినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు సమావేశం ఏర్పాటు చేసినందుకు ముందుగా వారు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది మా ఒక్కరి సమస్యే కాదని, దాదాపు 25 వేల కుటుంబాలకు చెందిన సమస్యని, వీలైననంత త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఇటీవల అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చి ఆందోళన నిర్వహించిన సందర్భంగా మంత్రి కేటీఆర్ 15 మంది వీఆర్ఏల ప్రతినిధులతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహణలో బిజీగా ఉందని, ఈ నెల 20వ తేదీన వారితో సమావేశం నిర్వహిస్తామని హామీ ఇవ్వగా వీఆర్ఏలు వెనుదిరిగారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ మరోసారి వీఆర్ఏలతో ఈరోజు సమావేశమయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + twelve =