కరీంనగర్‌ జైల్లో బండి సంజయ్‌ ను పరామర్శించిన కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్

Bandi Sanjay arrest news, BJP Calls For 14 Days Statewide Protest, BJP Plans Protest March Privilege Motion Against Telangana Govt, Mango News, MLA Eatala Rajender, MLA Eatala Rajender Visits Bandi Sanjay at Karimnagar District Jail, President Bandi Sanjay, Telangana BJP, Telangana BJP Chief Bandi Sanjay Arrested, Telangana BJP to Conduct Candlelight Rally, Telangana BJP to Conduct Candlelight Rally Today, Telangana State BJP president Bandi Sanjay sent to 14 days, Union Minister Kishan Reddy

రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి జీవో 317ను సవరించాలని డిమాండ్ చేస్తూ జనవరి 2, ఆదివారం రాత్రి కరీంనగర్ లోని తన క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జాగరణ దీక్షకు కూర్చున్న సంగతి తెలిసిందే. దీక్షకు అనుమతి లేకపోవడంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని కరీంనగర్ కోర్టులో హాజరుపరచగా, కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు బండి సంజయ్ ను కరీంనగర్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో కరీంనగర్‌ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న బండి సంజయ్‌ ను మంగళవారం ఉదయం బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, మాజీ ఎంపీ వివేక్ పరామర్శించారు. జైలు ములాఖత్‌ సమయంలో బండి సంజయ్‌ తో వీరు మాట్లాడారు.

అనంతరం కరీంనగర్‌లోని బండి సంజయ్‌ కార్యాలయాన్ని ఈటల రాజేందర్, వివేక్, ఇతర బీజేపీ నేతలతో కలిసి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కరోనా నిబంధనలు కేవలం బీజేపీకి మాత్రమే వర్తిస్తాయా అని ప్రశ్నించారు. అక్రమ కేసులకు బీజేపీ భయపడదని అన్నారు. ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడం, ఫైళ్లు, సీసీటీవీ పరికరాలను స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలు ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − sixteen =