ఫ్రాన్స్‌లో వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్ IHU

France detects new Covid-19 variant, France detects new COVID-19 variant IHU, France Reports Stronger Variant, IHU Named New COVID-19 Variant, IHU Named New COVID-19 Variant Reported, IHU Named New COVID-19 Variant Reported In France, IHU Named New COVID-19 Variant Reported In France More Severe Than Omicron, IHU variant, Mango News, New Covid 19 Variant, New Covid-19 variant IHU discovered in France, New novel coronavirus variant reported in 12 cases, Omicron Terror

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఇప్పటికే ఎన్నో వేరియెంట్స్ రూపంలో ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలు ఒణికి పోతున్నాయి. దీని కొత్త మ్యూటెంట్ ‘ఒమిక్రాన్‌‘ రూపంలో యూకే, ఫ్రాన్స్, అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా, భారత్ సహా పలు దేశాల్లో విరుచుకు పడుతోంది. ఓ వైపు ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుండగానే.. మరోవైపు ఫ్రాన్స్‌లో కొత్త వేరియంట్‌ కలకలం రేపుతోంది. ఫ్రాన్స్‌లో వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్‌ రకాన్ని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.

కరోనా కొత్త వేరియంట్‌ ను B.1.640.2 (IHU) గా శాస్త్రవేత్తలు నిర్దారించారు. ఈ కొత్త వేరియంట్‌లో 46 కొత్త మ్యుటేషన్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. అంటే.. ఒమిక్రాన్‌ కంటే ఎక్కువ ప్రమాదం. రెండు డోసుల టీకాలు వేసుకున్నా కూడా దీనిపైన ప్రభావం అంతగా ఉండదని చెప్తున్నారు. ఈ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కంటే వేగంగా వ్యాప్తి చెందుదుతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఫ్రాన్స్‌లో ఈ వేరియంట్‌ బారిన 12 మంది పడినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ 12 కేసులు మార్సెయిల్స్ సమీపంలో వచ్చాయి. దీంతో, ప్రపంచ దేశాలకు IHU ముప్పు కూడా పొంచి ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే, B.1.640.2 వేరియంట్ ఇంకా ఇతర దేశాలలో గుర్తించబడలేదు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 5 =