జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు-2022: తెలంగాణ రాష్ట్రం నుంచి ముగ్గురు ఎంపిక

Union Ministry Of Education Announces National Teachers Awards 2022 3 Telangana Teachers Selected, National Teachers Awards 2022, Mango News, Mango News Telugu, National Award For 3 Telangana Teachers, National Best Teachers Awards 2022, National Teachers Awards Latest News And Updates, President Droupadi Murmu, Teachers Day 2022, National Awards To Teachers 2022, National Teachers Awards News And Live Updates, Telangana News, Union Ministry Of Education,2022 National Teachers Awards, Teachers Day

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ గురువారం నాడు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు-2022 కు ఎంపికైన ఉపాధ్యాయుల జాబితాను ప్రకటించింది. దేశంలోని ఉపాధ్యాయుల విశిష్ట సేవలను గుర్తించడం మరియు వారి నిబద్ధతను గౌరవించండమే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఉద్దేశమని తెలిపారు. దేశవ్యాప్తంగా మొత్తం 46 మంది ఉపాధ్యాయులను ఈ పురస్కారాలకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెప్టెంబర్ 5, 2022న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఎంపిక చేసిన 46 మందికి ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.

ఎంపికైన ఉపాధ్యాయులలో తెలంగాణ నుంచి ముగ్గురు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరు ఉన్నారు. అలాగే ఉత్తరాఖండ్ నుండి ఒకరు అండమాన్ మరియు నికోబార్ ఐలాండ్స్ నుండి ఒకరు డిఫరెంట్లీ ఎబుల్డ్ టీచర్ల ప్రత్యేక కేటగిరీ కింద ఎంపికయ్యారు. ఇక తెలంగాణ నుంచి ఎంపికైన వారిలో మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా ప‌రిష‌త్ హైస్కూల్ ఉపాధ్యాయుడు టీఎన్ శ్రీధ‌ర్‌, ములుగు జిల్లా అబ్బాపూర్ జెడ్పి హైస్కూల్ ఉపాధ్యాయుడు కంద‌ల‌ రామ‌య్య‌, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని నాచారం ఢిల్లీ ప‌బ్లిక్ స్కూల్ ప్రిన్సిప‌ల్ సునీతారావు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కృష్ణా జిల్లాలోని కానూరు అస్నరా జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయురాలు డాక్టర్ రవి అరుణ ఎంపికయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =