జూలై 21 నుంచి మూడు రోజుల పాటుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ షర్మిల పర్యటన

YSRTP Chief YS Sharmila to Visit Flood Affected Areas in Telangana from July 21 to 23, YSRTP Chief to Visit Flood Affected Areas in Telangana from July 21 to 23, YS Sharmila to Visit Flood Affected Areas in Telangana from July 21 to 23, YSR Telangana Party, Flood Affected Areas in Telangana, Telangana Flood Affected Areas, Flood Affected Areas, YSRTP Chief YS Sharmila, YS Sharmila, YSRTP Chief, Telangana Flood Affected Areas News, Telangana Flood Affected Areas Latest News, Telangana Flood Affected Areas Latest Updates, Telangana Flood Affected Areas Live Updates, Mango News, Mango News Telugu,

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల దృష్ట్యా జూలై 21వ తేదీ నుంచి మూడు రోజుల పాటుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని వైఎస్ షర్మిల నిర్ణయించారు. ఈ మేరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. జూలై 21న ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో, జూలై 22న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో, జూలై 23న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి స్థానికంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ప్రభుత్వం తీసుకున్న తక్షణ సహాయక చర్యలు ఏ మేరకు అందుతున్నాయనే అంశాల మీద వైఎస్ షర్మిల పరిశీలించనున్నారని, అక్కడే మీడియాతో మాట్లాడుతారని ప్రకటనలో పేర్కొన్నారు.

వైఎస్ షర్మిల పర్యటన వివరాలు:

ఈ నెల 21 న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా:

  • ఉదయం 7 గంటలకు – లోటస్ పాండ్ పార్టీ కార్యాలయం నుండి ప్రారంభం
  • మధ్యాహ్నం 12 గంటలకు – కడెం ప్రాజెక్టు డామేజ్ పరిశీలన
  • 3:30 గంటలకు – పోసయ్య గూడెం – పోడు రైతులతో ఇంటరాక్షన్
  • రాత్రి 7 గంటలకు – రామగుండం రాత్రి బస.

జూలై 22న ఉమ్మడి కరీంనగర్ జిల్లా:

  • ఉదయం 8 గంటలకు – రామగుండంలో ప్రారంభం
  • ఉదయం 10గం – మంథని – నిరసన తెలుపుతున్న రైతులతో ఇంటరాక్షన్
  • మధ్యాహ్నం 2:30 గంటలకు అన్నారం మరియు కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శన
    4:30 గంటలకు – పలిమెల మండలం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించడం (భూపాలపల్లి జిల్లా)
  • 7:30 గంటలకు – బయ్యారం (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) రాత్రి బస.

జూలై 23న ఉమ్మడి ఖమ్మం జిల్లా:

  • ఉదయం 8 గంటలకు – బయ్యారం – రెడ్డి పాలెం వరద బాధితులతో ఇంటరాక్షన్
  • 11:30 గంటలకు – బూర్గంపహాడ్ – పొలాల సందర్శన
  • మధ్యాహ్నం 3 గంటలకు – భద్రాచలం సందర్శన.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − sixteen =