బరిలో ఎమ్మెల్యేల మద్దతు లేని అభ్యర్థి

AP Rajya Sabha,4 nominations, AP Rajya Sabha elections ,A candidate, MLAs support,election notification,YCP, Jagan,BJP, TDP, Jagan government,ysrcp,Rajya Sabha,Mango News Telugu,Mango News
AP Rajya Sabha,4 nominations, AP Rajya Sabha elections ,A candidate, MLAs support,election notification,YCP, Jagan,BJP, TDP, Jagan government,

ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు ఫిబ్రవరి 15తో మొదటి ఘట్టం ముగిసింది. ఫిబ్రవరి 8న ప్రారంభమయిన రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్  ప్రక్రియ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం  గురువారం అంటే ఫిబ్రవరి 15తో పూర్తయింది. ఇటు టీడీపీ ..ఈ   41 ఏళ్ల చరిత్రలో మొదటిసారి రాజ్యసభలో తమ ప్రాతినిధ్యం కోల్పోనుండటంపై రాజకీయ వర్గాలలో  చర్చ జరుగుతోంది.

ఏపీ నుంచి త్వరలో ఖాళీ అవుతున్న మూడు స్థానాల కోసం అధికార వైసీపీ మాత్రమే బరిలో నిలిచింది. ఆ పార్టీ నుంచి వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు,మేడా రఘునాథ రెడ్డి  నామినేషన్లు దాఖలు చేశారు.  మొత్తం రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఈ  ముగ్గురు అభ్యర్థులు  ఎన్నికల అధికారులకు అందించారు. ఈ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంది. కానీ  ఒక స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడంతో..మొత్తం 3 రాజ్యసభ స్థానాలకు నాలుగు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు.

సాధారణంగా అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్న పార్టీలే రాజ్యసభ బరిలో  ఉంటాయి. కానీ ఈసారి ఈ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా పెమ్మసాని ప్రభాకర్ నామినేషన్ వేశారు. కానీ నామినేషన్ల పరిశీలన సమయంలో ఎన్నికల అధికారులు ప్రభాకర్ నామినేషన్ తిరస్కరించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీసం పదిమంది ఎమ్మెల్యేలు ఆ అభ్యర్ధికి  మద్దతు ఇచ్చినట్లు సంతకాలు చేయాల్సి ఉంటుంది. కానీ  ప్రభాకర్ నామినేషన్ పత్రాల్లో ఎమ్మెల్యేలెవరూ సంతకాలు చేయలేదు. టీడీపీ ఎమ్మెల్యేల మద్దతు కోరడానికి ప్రభాకర్ చంద్రబాబు నివాసానికి వెళ్లినా కూడా.. ప్రభాకర్‌కు చంద్రబాబు అపాయింట్మెంట్ దొరకలేదు. మరోవైపు ఈ రోజు అంటే ఫిబ్రవరి 16న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్లు పరిశీలించిన తర్వాత . వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

టీడీపీ రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండటంతో వైసీపీకి లైన్ క్లియర్ అయినట్లు అయింది. ఈ ఏడాది రాజ్యసభకు ఏపీ నుంచి మూడు స్థానాలు ఖాళీ అవుతున్నాయి.  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్  పదవీ కాలం త్వరలో ముగియనుంది. దీంతో జగన్ ఎంపికతో..వైసీపీ తరపున ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే గొల్ల బాబూ రావుతో పాటు మేడా రఘునాథ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు.

టీడీపీ బరిలో లేకపోయినా ఇండిపెండెంట్ అభ్యర్థి పెమ్మసాని ప్రభాకర్ నామినేషన్ వేయడం హాట్ టాపిక్ అయింది. ప్రభాకర్‌కు ఒక్క ఎమ్మెల్యే మద్దతు కూడా లేదు . దీంతోనే  నామినేషన్ల పరిశీలన సమయంలో అధికారులు ప్రభాకర్ నామినేషన్ తిరస్కరించే అవకాశం ఉందని..వైసీపీ నుంచి నామినేషన్లు వేసిన ముగ్గురు అభ్యర్దుల ఎంపిక ఏకగ్రీవం కానుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమయినా అధికారిక ప్రకటన ఇక లాంఛనమే అవనున్నట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =