అంబటి రాంబాబును తప్పించే యోచనలో జగన్?

Jagan, ambati rambabu, AP, AP Elections,AP Elections 2024,NO TICKET,MLA ticket,YSR Congress party,Gudivada Amarnath,Andhra Pradesh News Updates, AP Political News, AP Politics, AP Elections,Mango News Telugu,Mango News,AP Election updates
Jagan, ambati rambabu, AP, AP Elections

ఎన్నికలవేళ ఊహకందని రీతిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. సీనియర్లు, మంత్రులు.. ఎంతటివారినైనా సహించడం లేదు. ప్రజాబలం తగ్గినవారిని.. వ్యతిరేకత పెరిగిన వారు.. ఎంతటివారినైనా సైడ్ చేసేస్తున్నారు. ఇప్పటికే గుడివాడ అమర్నాథ్‌ను జగన్ సైడ్ చేశారు. అటు గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానిని కూడా ఈసారి తప్పిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో మరో మంత్రికి కూడా ఈసారి టికెట్ కష్టమేననే ప్రచారం తెరపైకి వచ్చింది.

జగన్మోహన్ రెడ్డికి వీరవిధేయుడు అయిన మంత్రి అంబటి రాంబాబుకు కూడా ఈసారి టికెట్ కష్టమేననే ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో ఆయనపై వ్యతిరేకత పెరిగిపోయి.. ప్రజాబలం తగ్గిపోవడంతో ఆయన్ను తప్పించాలని జగన్ ఆలోచిస్తున్నారట. అటు సర్వేలు కూడా రాంబాబుకు వ్యతిరేకంగా వచ్చాయట. ఈసారి సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబు పోటీ చేస్తే ఓడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయట. లోకల్‌లో క్యాడర్ కూడా అంబటి రాంబాబును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట.

రేపల్లె నుంచి 1989లో తొలిసారి కాంగ్రెస్ తరుపున రాంబాబు పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత వరుసగా 1994, 1999లో అదే నియోకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికలకు అంబటి దూరంగా ఉన్నారు. తిరిగి 2014 ఎన్నికల్లో రాంబాబు పోటీ చేశారు. వైసీపీ తరుపున గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి 2014 ఎన్నికల్లో పోటీ చేసిన అంబటి.. కోడెల శివప్రసాదరావు చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో మరోసారి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. రెండో విడతలో జగన్మోహన్ రెడ్డి కేబినెట్‌లో కూడా అంబటి చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం జలవనరుల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు.

అయితే ఈసారి అంబటికి గెలుపు అవకాశాలు లేకపోవడంతో.. ఆయన్ను తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని జగన్ ఆలోచిస్తున్నారట. ఇదే సమయంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి సత్తెనపల్లి టికెట్ ఆశిస్తున్నారు. ఆ టికెట్ కోసం తన సైడ్ నుంచి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ కూడా వెంకట్రామిరెడ్డికి టికెట్ ఇచ్చే దానిపై పునరాలోచన చేస్తున్నారట. అటు సర్వేలు కూడా సత్తెనపల్లిలో చేసిన పలు సర్వేలు కూడా వెంకట్రామిరెడ్డికి అనుకూలంగా వచ్చాయట. దీంతో జగన్ కూడా వెంకట్రామిరెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − eleven =