నేడో, రేపో చంద్రబాబుతో భేటీ

CM Jagan, YCP, TDP, Janasena, Chandrababu, Pawan Kalyan,Will Baireddy join TDP?, Meeting with Chandrababu,Byreddy,Rayalaseema,Andhra Pradesh News Updates, AP Politics, AP Elections,Mango News Telugu,Mango News
CM Jagan, YCP, TDP, Janasena, Chandrababu, Pawan Kalyan,Will Baireddy join TDP?, Meeting with Chandrababu

ఏపీలో రాజకీయ సమీకరణాలు విశ్లేషకుల అంచనాలకు మించి మరీ శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో రాజకీయ పార్టీలన్నీ కూడా వివిధ స్ట్రాటజీలతో గెలుపుపైనే ప్రత్యేక దృష్టిని పెట్టి దూసుకుపోతున్నాయి. ఎన్నికలలో గెలుస్తారన్న నమ్మకం ఉన్నవారికే  టికెట్ ఇవ్వాలని ఆయా పార్టీ అధినేతలు భావిస్తున్నారు. అందరికీ సమన్యాయం కుదిరేపని కాదు కాబట్టి.. ఈ  సమయంలో టికెట్ దక్కని నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ఎవరికి వారే తమ రాజకీయ ప్రయోజనాల కోసం అధికారమే లక్ష్యంగా పార్టీ కండువాలు మార్చేస్తున్నారు.

ఇప్పటికే అధికార , ప్రతిపక్ష పార్టీల నుంచి భారీ జంపింగ్‌లు  కొనసాగుతున్నాయి. అయితే ఈ సమయంలోనే  రాయలసీమలోని కీలక నేతపై టీడీపీ అధినేత గురి పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో రాయలసీమ పరిరక్షణ కమిటీ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే  బైరెడ్డి రాజశేఖరరెడ్డి త్వరలోనే  టీడీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతుంది.  ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న ఆయన..రాబోయే ఎన్నికల్లో  టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్న వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి..

బైరెడ్డి రాజశేఖరరెడ్డిని తెలుగు దేశం పార్టీలోకి తీసుకువచ్చే బాధ్యతను రాయలసీమ నాయకులకు చంద్రబాబు అప్పగించగా..  బైరెడ్డి రాజశేఖరరెడ్డితో  నేతలు చర్చలు జరిపారట. బైరెడ్డి  కూడా టీడీపీలోకి రావడానికి అభ్యంతరం చెప్పలేదని.. ఈ రోజో, రేపో  చంద్రబాబుతో భేటీ అవుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. కాకపోతే  తనతో పాటు తన కూతురుకు కూడా బైరెడ్డి రాజశేఖరరెడ్డి టికెట్ అడుగుతున్నారట. తనకు పాణ్యం ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని..తన కూతురుకు నంద్యాల ఎంపీ స్థానం ఇవ్వాలని  బైరెడ్డి  పట్టుపడుతున్నారట. బైరెడ్డి రాజశేఖరరెడ్డి అడిగిన స్థానాలపై చంద్రబాబు తర్జన భర్జనలు పడుతున్నారట. ఇప్పటికే ఆ స్థానాల్లో తమకే టికెట్ వస్తుందని భారీగా ఖర్చు పెట్టిన నాయకులకు.. ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలో తెలియని  స్థితిలో చంద్రబాబు పడ్డారట.

నిజానికి 2019 ఎన్నికల సమయంలోనే బైరెడ్డి రాజశేఖరరెడ్డి తెలుగుదేశంలో చేరాలని భావించినా..కొంతమంది  టీడీపీ నాయకులు అడ్డుపడటంతో ఆయన బీజేపీలోనే ఉండిపోయారు. తిరిగి ఈ  ఎన్నికలలో  బైరెడ్డిని టీడీపీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలవడంతో..కొద్దిరోజుల్లో బైరెడ్డి  సైకిలెక్కడం  ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి. బైరెడ్డి నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2012లో తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీలో చేరిన బైరెడ్డి .. తిరిగి తన సొంత గూటికి చేరనున్నారన్న ప్రచారం జోరందుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =