రాజుకుంటున్న పొత్తు చిచ్చు

Anaparthi Is Seat Panchayat In TDP, Anaparthi Seat Panchayat, Panchayat In TDP, TDP Panchayat, Chandrababu,TDP Leaders, Mulagapati Shivaramakrishnam Raju, Anaparthi, Nallamilli Ramakrishna Reddy, Anaparthi Seat News, Anaparthi Political News, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Chandrababu,TDP Leaders, Mulagapati Shivaramakrishnam Raju, Anaparthi, Nallamilli Ramakrishna Reddy,Anaparthi is seat panchayat in TDP

అనపర్తి టీడీపీలో తెలుగు తమ్ముళ్ల మధ్య  సీట్ల కుంపటి భగ్గుమంటోంది. అక్కడ టికెట్ తనదేనని ముందునుంచీ చెబుతూ వస్తున్న మాజీ టీడీపీ ఎమ్మెల్యే నల్లిమల్లి రామకృష్ణారెడ్డి ప్రకటనకు ముందుగానే ప్రచారాలకు రెడీ అయిపోయారు. అనుకున్నట్లే టీడీపీ విడుదల చేసిన మొదటి విడత జాబితాలో తన పేరు ఉండటంతో తానే గెలుస్తానన్న నమ్మకాన్ని పెంచుకున్నారు.

తొలి జాబితా రిలీజ్ తర్వాత నల్లిమిల్లి  రామకృష్ణారెడ్డి నియోజకవర్గమంతా పర్యటిస్తూ, ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. కానీ తే ఆ తరువాత టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా..బీజేపీకి  పది అసెంబ్లీ, ఆరు లోక్ సభ స్థానాలను కేటాయించారు. ఆ పది అసెంబ్లీ సీట్లలో   అనపర్తి సీటును  కమలం పార్టీకి  కేటాయించారు. అనపర్తి  బీజేపీ అభ్యర్థిగా మొలగపాటి శివరామకృష్ణం రాజు పేరును ఈ పార్టీ ప్రకటించడంతో.. నల్లిమిల్లి కంగుతిన్నారు. టీడీపీ అధిష్టానం ఈ విషయాన్ని రామకృష్ణారెడ్డికి ముందుగా తెలియజేయకపోగా.. టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి తర్వాత  బీజేపీకి  ఎలా కేటాయిస్తారంటూ నల్లిమిల్లి అనుచరులు చంద్రబాబుపై తీవ్రంగా మండిపడుతున్నారు.

దీంతో ఐదు రోజులుగా అనపర్తి సీటు విషయంలో తెలుగు దేశం పార్టీలో  పెద్ద చర్చ జరుగుతోంది. అయితే చంద్రబాబు నాయుడి నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు అనుచరులెవరు ఆవేశ పడొద్దంటూ నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సర్ది చెబుతూ వచ్చారు. అయితే  బిక్కవోలు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న  రామకృష్ణారెడ్డిని ప్రచారం చేయొద్దని  నిలిపివయడంతో పాటు, ఆయన కుటుంబ సభ్యులను కూడా ప్రచారం చేయకుండా అడ్డుకున్నారు. దీంతో  ఆగ్రహం వ్యక్తం చేసిన నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పార్టీ రాష్ట్ర జిల్లా స్థాయి పదవులకు రాజీనామా చేస్తూ.. రాజమహేంద్రవరంలో ఉన్న టీడీపీ జోన్ 24 కోఆర్డినేటర్ వెంకట సుజయ్ కృష్ణ రంగారావుకు లేఖలు అందించారు. అంతేకాదు అదేరోజు  బిక్కవోలు మండలం వందలపాక గ్రామంలో ధర్నా చేశారు.

ఆ మర్నాడు పెదపూడిలో నల్లిమిల్లి వర్గీయులు నిరసన చేపట్టారు. అదేరోజు సాయంత్రమే బీజేపీ  అభ్యర్థిగా శివరామకృష్ణంరాజు పేరు ప్రకటించడంతో టీడీపీ నాయకులు, నల్లిమిల్లి వర్గీయులు మరింత ఆగ్రహానికి గురయ్యారు.దీనిపై రాయవరంలోని రామకృష్ణారెడ్డి నివాసానికి  మార్చి 28న  పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు చేరుకుని భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఇప్పటికైనా టీడీపీ అధిష్టానం స్పష్టమైన ప్రకటన చేసి నల్లిమిల్లి రామకృష్ణ రెడ్డికి టికెట్ ఇవ్వాలని వారంతా డిమాండ్ చేశారు. 40 ఏళ్లుగా నియోజకవర్గంలో టీడీపీ జెండా మోస్తున్న నల్లిమిల్లి కుటుంబానికి చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా టీడీపీ ఎన్నికల ప్రచార కరపత్రాలతో పాటు పార్టీ జెండాలను కూడా కుప్పగా పోసి తగలబెట్టి నిరసనను తెలియజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + three =