వైఎస్సార్ నాకు దేవుడు, ఆ మహానేత ఆశీస్సుల కోసమే ఇడుపులపాయకు వచ్చా – మంత్రి రోజా

Andhra Pradesh Minister Roja Visits Idupulapaya YSR Ghat After Takes Charge, Minister Roja Visits Idupulapaya YSR Ghat After Takes Charge, Andhra Pradesh Minister Roja Visits Idupulapaya YSR Ghat, YSR Ghat, Idupulapaya YSR Ghat, RK Roja Takes Charge as AP Tourism Culture and Youth Advancement Minister, RK Roja Takes Charge as AP Tourism Minister, RK Roja Takes Charge as AP Youth Advancement Minister, AP Tourism Minister, AP Youth Advancement Minister, RK Roja took charge as Minister of Tourism, RK Roja took charge as Minister of Culture and Youth Advancement, Nagari MLA RK Roja, MLA RK Roja, Nagari MLA, RK Roja, Actor-turned-politician, Actor-turned-politician Nagari MLA RK Roja, new reshuffled Cabinet Ministry of Andhra Pradesh, Andhra Pradesh Cabinet, Cabinet reshuffle, AP Cabinet reshuffle News, AP Cabinet reshuffle Latest News, AP Cabinet reshuffle Latest Updates, AP Cabinet reshuffle Live Updates, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, YS Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

వైఎస్సార్ నాకు దేవుడు, ఆ మహానేత ఆశీస్సుల కోసమే ఇడుపులపాయకు వచ్చానాని తెలిపారు పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. ఈరోజు ఇడుపులపాయకు విచ్చేసిన మంత్రి రోజా వైఎస్సార్‌ ఘాట్ వద్ద ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి ఇక్కడకు వచ్చిన రోజా వైఎస్సార్ ను తలుచుకుని కొంచెం భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్సార్ సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి నమస్కరించారు. వైఎస్సార్‌కు నివాళులు అర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆ మహానేతతో కలిసి పనిచేయాలనుకున్నానని, అయితే తనకు ఆ అదృష్టం దక్కలేదని పేర్కొన్నారు. కానీ, ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ ఆశీర్వాదంతో మంత్రిని అయ్యానని, ఈ సందర్భంగా తనవంతు బాధ్యతగా కృతఙ్ఞతలు తెలుపుకోవాలని, అలాగే ఆశీర్వాదం తీసుకోవాలని భావించి ఇక్కడకు వచ్చానని వెల్లడించారు రోజా.

నేను టీడీపీలో పనిచేసేటప్పుడు నా పనితీరు చూసి వైఎస్సార్‌ తమ పార్టీలోకి రమ్మని ఆహ్వానించారని, అయితే ఈలోపే ఆయన అకాల మరణం పొందారని మంత్రి రోజా తెలిపారు. ఇక రాజకీయ జీవితం ప్రారంభమైంది టీడీపీలో అయినా తొలిసారి ఎమ్మెల్యే అయింది మాత్రం వైసీపీ లోకి వచ్చాకే అని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ తనపై పెట్టుకున్న నమ్మకమే నన్ను ఎన్నికలలో విజయం సాధించేలా చేసిందని, అందుకే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందనని తెలిపారు. అంతేకాక ఇప్పుడు తనని ఏకంగా మంత్రిని కూడా చేసారని, సీఎం జగన్ దగ్గర పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి రోజా చెప్పారు. తాను గతంలో ఒకసారి ఒంటిమిట్ట రథోత్సవానికి హాజరయ్యానని అప్పుడు జగన్‌ను సీఎం చేయాలని ఆ సీతారాములని ప్రార్ధించానని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ కోరిక నెరవేర్చినందుకు ఆ స్వామివారికి కృతఙ్ఞతలు తెలుపుకోవడంతో పాటు మరోసారి కళ్యాణోత్సవం తిలకిస్తానని రోజా తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =